News March 4, 2025

KNR: MLC ఎలక్షన్స్.. 24 ఓట్ల ఆధిక్యంలో BJP

image

కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి ఫస్ట్ రౌండ్‌లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 6,697 ఓట్లు పోలయ్యాయి. కాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి 6,673, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 5,897 ఓట్లు పోలయ్యాయి. తన సమీప అభ్యర్థి నరేందర్ రెడ్డిపై 24 ఓట్ల లీడ్‌లో అంజిరెడ్డి ముందంజలో ఉన్నారు.

Similar News

News March 4, 2025

మూడోసారి బెయిల్ పొందిన రెజ్లర్ సుశీల్ కుమార్

image

మర్డర్ కేసులో మాజీ రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.50,000 బాండు, 2 ష్యూరిటీలు ఇచ్చాక ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. 2021, మేలో జూనియర్ రెజ్లర్ సాగర్ ధన్‌ఖడ్ హత్య కేసులో ఆయన ప్రధాన నిందితుడు. దీంతో పాటు అల్లర్లు, అక్రమంగా గుమికూడటం వంటి అభియోగాలు ఆయనపై నమోదయ్యాయి. 2023, మార్చిలో తండ్రి అంత్యక్రియలు, జులై 23న మోకాలి ఆపరేషన్ కోసం ఆయన వారం పాటు బెయిల్ పొందడం గమనార్హం.

News March 4, 2025

ఔరంగజేబ్ సమాధి తొలగించండి: నవనీత్ కౌర్

image

మహారాష్ట్ర సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అబూ అజ్మీపై బీజేపీ నేత నవనీత్ కౌర్ ధ్వజమెత్తారు. శివాజీ మహారాజ్ రాష్ట్రంలో ఔరంగజేబ్‌ను పొగటటం ఏంటని ప్రశ్నించారు. ఔరంగజేబ్ సమాధిని రాష్ట్రం నుంచి తొలగించాలని ప్రభుత్వాన్నికోరారు. ఆయనను ఇష్టపడే వారింట్లో ఏర్పాటు చేసుకోమన్నారు. అతని దాష్ఠీకాలు తెలియాలంటే ఛావా సినిమా చూడాలని సూచించారు. మెుగల్ రాజు మందిరాలు నిర్మించాడని, ఆయన పరిపాలన బాగుండేదని అబూ అజ్మీ అన్నారు.

News March 4, 2025

నల్గొండ: ఇంటర్ పరీక్షలకుసర్వం సిద్ధం: డీఐఈఓ

image

రేపటి నుంచి ప్రారంభంమయ్యే ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేశామని డీఐఈఓ దశ్రు నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. విద్యార్థులు గంటముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.

error: Content is protected !!