News September 19, 2025

KNR: NOV నుంచి అంగన్వాడీ పిల్లలకు ‘బ్రేక్ ఫాస్ట్’

image

అంగన్వాడీల చిన్నారులకు బ్రేక్ ఫాస్ట్ స్కీం అమలు చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. NOV 19న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి నుంచి ఈ ప్రోగ్రాంను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిపై ఇప్పటికే మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలందాయి. కాగా, ఉమ్మడి KNRలో 3,135 అంగన్వాడీలు ఉండగా, 74,550 మంది చిన్నారులు చదువుతున్నారు. మరోవైపు చిన్నారులకు, సిబ్బందికి 2జతల చొప్పున యూనిఫాంలను ప్రభుత్వం ఇవ్వనుంది.

Similar News

News September 19, 2025

22 నుంచి కడపలో డిగ్రీ కాలేజీల బంద్..!

image

ఫీజు బకాయిల విడుదల కోసం డిగ్రీ విద్యా సంస్థలు బంద్ చేయాలని వైవీయూ డిగ్రీ కాలేజీ ప్రైవేట్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నిర్ణయించింది. అసోసియేషన్ కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాల్లో ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై చర్చ జరపాలన్నారు. ఫీజులు రాక కళాశాలలు నడిపేందుకు ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈనెల 22 నుంచి బంద్ చేస్తామంటూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ పద్మకు బంద్ నోటీసులు ఇచ్చారు.

News September 19, 2025

HYD: పూల వర్షం.. బతుకమ్మకు సరికొత్త అందం!

image

తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఈసారి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. పర్యాటకశాఖ ఆధ్వర్యంలో భాగ్యనగర వీధులు పూల పండుగ శోభతో ముస్తాబవ్వనున్నాయి. తెలంగాణలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ ఘనత చాటి చెప్పేలా బహుముఖ ప్రణాళికలు రూపొందాయి. ఊహకందని ఏర్పాట్లులతో ఈ వేడుకలు భాగ్యనగరానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకురానున్నాయి.

News September 19, 2025

నెల్లూరు: ఏడుగురి మృతి.. ముగ్గురిపై కేసు

image

సంగం మండలం పెరమన వద్ద కారును ఇసుక టిప్పర్ ఢీకొని ఏడుగురు చనిపోయిన ఘటనలో ముగ్గురిపై కేసు నమోదైంది. ఏ1గా టిప్పర్ డ్రైవర్, ఏ2గా టిప్పర్ యజమానిని, ఏ3గా బుజ్జినాయుడు పేర్లు నమోదు చేశారు. బుజ్జినాయుడిని ఇసుక వ్యాపారిగా పోలీసులు భావిస్తున్నారు. ఇసుకను ఆత్మకూరు వైపు నుంచి తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. ఆత్మకూరు పరిధిలో ప్రస్తుతం ఏ ఇసుక రీచ్‌కు అనుమతులు లేకపోవడం గమనార్హం.