News February 27, 2026

KNR: SUలో తెలుగు పీహెచ్డీ ప్రవేశ మౌఖిక పరీక్షలు

image

శాతవాహన విశ్వవిద్యాలయంలో తెలుగు విభాగంలో పీహెచ్డీ ప్రవేశ మౌఖిక పరీక్షలు మార్చి 6వ, 7వ తేదీల్లో ఉదయం 10:30 నుంచి విభాగాధిపతి కార్యాలయంలో నిర్వహిస్తామని శాతవాహన విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ సంచాలకులు డా.మహమ్మద్ జాఫర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ లో చూడాల్సిందిగా కోరారు.

Similar News

News April 12, 2026

తిరుపతి గంగమ్మ జాతర ఎప్పుడంటే?

image

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర మే 5న చాటింపుతో ప్రారంభం కానుంది. 6వ తేదీ భైరాగి వేషం, 7న బండ వేషం, 8న తోటి వేషం, 9న దొర వేషం, 10న మాతంగి వేషాలు ఉంటాయి. 11న సున్నపు కుండలు, 12న జాతర, 13న అమ్మవారి విశ్వరూప దర్శనంతో జాతర ముగుస్తుంది. జాతర పోస్టర్లను ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు ఆదివారం ఆవిష్కరించారు.

News April 12, 2026

కొడకండ్ల విద్యార్థినులకు 994 మార్కులు

image

ఇంటర్మీడియట్ ఫలితాల్లో జనగామ జిల్లా కొడకండ్ల గురుకుల విద్యార్థులు మరోసారి ప్రతిభ చాటారు. వరుసగా నాలుగోసారి 100% ఉత్తీర్ణత సాధించారు. సెకండ్ ఇయర్‌ BIPCలో M.సింధు, B.పావని 1000 మార్కులకు గాను 994 సాధించి రాష్ట్ర స్థాయి ర్యాంకులు పొందినట్లు ప్రిన్సిపల్ తమ్మి దిలీప్ కుమార్ తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులను ఆయన అభినందించారు.

News April 12, 2026

మహిళా రిజర్వేషన్ చట్టం.. ఫ్లోర్ లీడర్లకు మోదీ లేఖ

image

మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు టైమ్ వచ్చిందని PM మోదీ స్పష్టం చేశారు. 2029 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నుంచే కోటా అమల్లోకి వస్తుందని ఫ్లోర్ లీడర్లకు రాసిన లేఖలో వెల్లడించారు. ఈ చట్టానికి సంబంధించిన సవరణ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించాలని MPలను కోరారు. ఏప్రిల్ 16 నుంచి 3రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు, MPలు హాజరు కావాలని BJP విప్ జారీ చేసింది.