News February 27, 2026

KNR: SUలో తెలుగు పీహెచ్‌డీ మౌఖిక పరీక్షలు

image

శాతవాహన విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పీహెచ్‌డీ ప్రవేశ మౌఖిక పరీక్షలు మార్చి 6, 7వ తేదీల్లో ఉదయం 10:30 నుంచి విభాగాధిపతి కార్యాలయంలో నిర్వహిస్తామని శాతవాహన విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ సంచాలకులు డా.మహమ్మద్ జాఫర్ తెలిపారు. ఇతర పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Similar News

News February 27, 2026

మాంసం వ్యర్థాల మాయాజాలం.. కాంట్రాక్టర్లకు జీవీఎంసీ చెక్

image

మాంసం వ్యర్థాల ద్వారా GVMCకు వచ్చే ఆదాయం కాంట్రాక్టర్ల జేబుల్లోకి వెళ్తున్న వ్యవహారంపై అధికారులు దృష్టి సారించారు. రోజుకు 10-15 టన్నులు, ఆదివారం 30 టన్నుల వరకు వ్యర్థాల సేకరణ జరుగుతున్నట్టు నెల రోజుల సర్వేలో తేలింది. ఇవి కాపులుప్పాడకు తరలించాల్సి ఉండగా గోదావరి జిల్లాల చేపల చెరువులకు మళ్లుతున్నట్లు గుర్తించారు. ఇకపై వీటిని కాపులుప్పాడ డంపింగ్ యార్డులోనే టెండర్ ద్వారా విక్రయించాలని నిర్ణయించారు.

News February 27, 2026

మార్చి తొలి వారం నుంచే మండే ఎండలు!

image

AP: రాష్ట్రంలో మే నుంచి జులై మధ్యలో లేదా ఆగస్టులో <<19097558>>ఎల్ నినో<<>> వచ్చే అవకాశం అధికంగా ఉందని ప్రైవేట్ వాతావరణ సంస్థలు అంచనా వేశాయి. దీనివల్ల ఖరీఫ్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపాయి. మరోవైపు మార్చి తొలివారంలోనే ఎండలు, ఉక్కపోత పెరిగే ఛాన్స్ ఉందని IMD వెల్లడించింది. కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4 డిగ్రీలు పెరుగుతాయని తెలిపింది.

News February 27, 2026

మెదక్: నాడు అడిషనల్ కలెక్టర్.. నేడు కలెక్టర్!

image

మెదక్ జిల్లా నూతన కలెక్టర్‌గా నియమితులైన ప్రతిమా సింగ్ గతంలో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్‌గా పని చేశారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా పని చేస్తున్న ప్రతిమా సింగ్ తాజాగా జరిగిన బదిలీల్లో భాగంగా మెదక్ కలెక్టర్‌గా పదోన్నతిపై రానున్నారు. ముక్కుసూటిగా వ్యవహరించే ప్రతిమా సింగ్ కలెక్టర్‌గా ఎలాంటి మార్కు చూపిస్తారోనని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.