News September 10, 2025
KNR: SU LLB, LLM పరీక్షల ఫీజు నోటిఫికేషన్ విడుదల

SU పరిధిలో జరగనున్న LLB 4వ సెమిస్టర్, LLM 2వ, 4వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్‌ను అధికారులు విడుదల చేశారు. దీని ప్రకారం అపరాధ రుసుము(లేట్ ఫీ) లేకుండా SEPT 18 వరకు, లేట్ ఫీజు రుసుము రూ.300తో SEPT 22 వరకు చెల్లించుకోవచ్చని శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షలు నియంత్రణాధికారి డా.సురేశ్ కుమార్ తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ వెబ్ సైట్‌ను లేదా ఆయా కళాశాలలను సంప్రదించవచ్చని సూచించారు.
Similar News
News September 10, 2025
పటాన్‌చెరులో యాక్సిడెంట్.. మహిళ మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన పటాన్‌చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ORRపై జరిగింది. ఔటర్ రింగ్ రోడ్డుపై నడిచి వెళ్తున్న మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 10, 2025
KNR: విచ్చలవిడిగా ‘అన్‌వాంటెడ్ ప్రెగ్నెన్సీ’ కిట్స్ అమ్మకాలు

ఉమ్మడి KNR వ్యాప్తంగా గర్భవిచ్ఛిత్తి కిట్స్‌ను విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ప్రెగ్నెన్సీ వద్దనుకునేవారు నేరుగా మెడికల్ షాపులను సంప్రదిస్తుండడంతో ఈ తతంగం సాగుతోంది. దీనిపై ఔషధ నియంత్రణ పరిపాలన విభాగం ప్రత్యేక దృష్టి పెట్టి తనిఖీలు చేపట్టింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, మందులకు రశీదివ్వని షాపులపై చర్యలకు పూనుకుంది. ఇష్టారీతిన KITS వినియోగిస్తే తల్లీబిడ్డకు ప్రమాదమని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
News September 10, 2025
ఇద్దరు ISIS అనుమానిత ఉగ్రవాదుల అరెస్ట్

ఇద్దరు ISIS అనుమానిత ఉగ్రవాదులను ఢిల్లీ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని ఇస్లాంనగర్‌లో అజార్ డానిష్, ఢిల్లీలో అఫ్తాబ్‌ను అదుపులోకి తీసుకుంది. వారి నుంచి ఆయుధాలు, బుల్లెట్లు, ఎలక్ట్రానిక్ డివైజెస్ స్వాధీనం చేసుకుంది. వీరిద్దరూ ఉగ్రకార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించింది. సెంట్రల్ ఏజెన్సీస్, ఝార్ఖండ్ ఏటీఎస్‌తో కలిసి రైడ్స్ చేసి వారిని పట్టుకుంది.