News February 11, 2025
KNR: అమృత మిత్రను విజయవంతం చేయాలి: కమిషనర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739198224159_60315467-normal-WIFI.webp)
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమృత్ మిత్ర పథకాన్ని మహిళా స్వయం సహాయక సంఘాలు విజయవంతం చేయాలని కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సోమవారం మహిళా సంఘ సభ్యులతో సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద ప్రారంభించిన అమృత్ మిత్ర ప్రాజెక్టు మార్గదర్శకాలపై చర్చించారు.
Similar News
News February 11, 2025
సైదాపూర్: ఎవరి లెక్క ఏంటో తేలాలని రాహుల్ అప్పుడే అన్నారు: మంత్రి పోన్నం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739257395340_50131020-normal-WIFI.webp)
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే మార్గదర్శకమని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎవరి లెక్క ఏంటో తేలాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోనే స్పష్టం చేశారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ దొందు దొందే, రాంగ్ డైరెక్షన్‌లో పోయేలాగా ఈ రెండు పార్టీలు ప్రవర్తిస్తున్నాయన్నారు.
News February 11, 2025
పెద్దపల్లి: ఇద్దరు మేకల దొంగల అరెస్ట్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739248515296_1259-normal-WIFI.webp)
కాల్వశ్రీరాంపూర్, మల్యాలలో మేకలు దొంగతనం చేసిన చొప్పదండికి చెందిన మనుపతి సంజీవ్‌కుమార్, కమాన్‌పూర్ మండలం పెంచకల్‌పేటకు చెందిన శివరాత్రి రమేశ్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు. వీరు జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 2న కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన టీ.కొమురయ్య 3, మల్యాలకు చెందిన బీ.రాజయ్య 2 మేకలను దొంగతనం చేశారని ఎస్‌ఐ తెలిపారు.
News February 11, 2025
కాశీలో రాజన్న సిరిసిల్ల జిల్లా వాసి మృతి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739248327382_1259-normal-WIFI.webp)
కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కదిరే శ్రీనివాస్ గౌడ్ (45) కాశీలో మృతి చెందాడు. కుటుంబసభ్యులు వివరాల ప్రకారం.. 4 రోజుల క్రితం మిత్రులతో కలిసి ప్రయాగ్ రాజ్ లోని కుంభమేళాకు వెళ్లారు. తరువాత అయోధ్య రామమందిరాన్ని దర్శించుకొని ఆదివారం కాశీకి వెళ్లారు. కాశీలో దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉండగా స్పృహతప్పి కిందపడ్డాడు. స్నేహితులు హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.