News June 2, 2024

KNR: ఉద్యమ జ్ఞాపకాల్లో పోరుగడ్డ

image

స్వరాష్ట్ర సాధనలో ఉమ్మడి కరీంనగర్ కీలక పాత్ర పోషించింది. 2009 నవంబర్‌ 29‌న కేసీఆర్‌ ఇక్కడి నుంచి ‌మొదలు పెట్టిన ఆమరణ దీక్ష మలి దశ ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచింది. 2004లో అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన సభలోనే సోనియాగాంధీ తెలంగాణ ఆకాంక్షను నెరవేరుస్తామన్నారు. సుల్తానాబాద్ చౌరస్తాలో మహాదీపాన్ని దాదాపు 1600 రోజులపాటు వెలిగించి ఉద్యమ ఆకాంక్షను చాటారు.

Similar News

News September 30, 2024

ఆదర్శ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు నిలవాలి: సీతక్క

image

తెలంగాణలోని ప్రతి పల్లె ఆదర్శ గ్రామంగా నిలిచేలా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క అన్నారు. కరీంనగర్లో ఆమె మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్ బిల్లుల అంశం సీఎం దృష్టిలో ఉందని త్వరలో సమస్య పరిష్కరిస్తామన్నారు. ప్రతి గ్రామపంచాయతీ కార్యదర్శి క్షేత్రస్థాయిలో గ్రామాల్లో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ ద్వారా గ్రామస్తులకు ఉపయోగపడే పనులు మాత్రమే చేయాలన్నారు.

News September 30, 2024

ధర్మపురిలో నిత్యం 2 వేల లడ్డూ విక్రయాలు

image

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి లడ్డూ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇక్కడ ఆలయంలో ప్రతిరోజు 2000 లడ్డూ విక్రయాలు జరుగుతాయి. సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా 80 గ్రాముల లడ్డూ ప్రసాదానికి రూ.20 అలాగే 200 గ్రాముల పులిహోర ప్రసాదానికి రూ.15 తీసుకుంటున్నారు. 2023-24 సంవత్సరానికి లడ్డూ ప్రసాదం ద్వారా రూ.1,50,20,00, పులిహోర ప్రసాదం ద్వారా రూ.54,69,750 ఆదాయం సమకూరింది.

News September 30, 2024

ముస్తాబాద్‌: బస్సు కింద పడి చిన్నారి మృతి

image

ముస్తాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందింది. సాల్కం మనోజ్ఞ(4) మండల కేంద్రంలోని మహర్షి పబ్లిక్ స్కూల్లో చదువుతోంది. స్కూల్ బస్సు దిగుతుండగా ప్రమాదవశాత్తు టైర్ల కింద పడింది. దీంతో చిన్నారి తలకు తీవ్రగాయలై అక్కడికక్కడే మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.