News April 30, 2024

KNR: ఎంపీ ఎన్నికలు.. ఇదీ పరిస్థితి!

image

MP ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. కరీంనగర్‌లో 33 నామినేషన్లు ఆమోదించగా.. ఐదుగురు విత్‌డ్రా చేసుకొన్నారు. 28 మంది బరిలో నిలిచారు. పెద్దపల్లి లోక్‌సభలో 49 నామినేషన్లు ఆమోదించగా.. ఏడుగురు విత్‌ డ్రా చేసుకోగా.. 42 మంది బరిలో ఉన్నారు. SHARE IT

Similar News

News January 11, 2025

BRS కార్యాలయంపై దాడిచేసిన వారిని అరెస్టు చేయాలి: కేటీఆర్

image

యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ Xలో స్పందించారు. ప్రతిపక్ష పార్టీల కార్యాలయాలపైన దాడులు చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో అధికారంలోకి వచ్చి తెలంగాణలో గుండారాజ్యం చలాయిస్తున్నారని పలు వ్యాఖ్యలు చేశారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

News January 11, 2025

కరీంనగర్: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి

image

ఉమ్మడి KNR జిల్లాలో నిన్న జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు మృతిచెందారు. వివరాలిలా.. జగిత్యాల(D)లో జరిగిన <<15121069>>రోడ్డు <<>>ప్రమాదంలో జాబితాపూర్‌ వాసులు అరవింద్, సాయి, కొండాపూర్‌ వాసి వంశీ మృతిచెందారు. పుట్టిన రోజు <<15121119>>వేడుకలు <<>>జరుపుకోని వస్తున్న మంగపేట వాసి రాజకుమార్, అప్పన్నపేట వాసి అభినవ్‌‌‌ను బొలెరో ఢీకొట్టింది. చిన్నకల్వల వాసి ఈశ్వరమ్మను సుల్తానాబాద్ వద్ద <<15121180>>లారీ <<>>ఢీకొనడంతో మరణించింది.

News January 11, 2025

కరీంనగర్: ఫుడ్ పాయిజన్.. అధికారుల SUSPEND

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మహాత్మా నగర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో ఇటీవల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వి.రేవను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై సమాచారం ఇవ్వకుండా విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.