News December 19, 2024
KNR: తాటి గేగులు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు!
ప్రస్తుత శీతాకాలంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తాటి తేగలు(తాటి గేగులు) మార్కెట్లో లభిస్తున్నాయి. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తాటి తెగలో ముఖ్యంగా పీచు, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి తినడం వలన తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. తెగలను బాగా ఉడికించి.. మిరియాలు, ఉప్పు రాసుకుని తీసుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
Similar News
News February 5, 2025
జగిత్యాల: కానిస్టేబుల్ నుంచి ఎస్ఐగా
మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా, 2018లో సిరిసిల్ల జిల్లాలో పోలీసు కానిస్టేబుల్‌గా జీవితం మొదలు పెట్టారు. అనంతరం 2020లో జగిత్యాల జిల్లాలోని పెగడపల్లిలో ఎస్ఐగా పనిచేశారు. అనంతరం కథలాపూర్, వెల్గటూర్, కోరుట్లలో కూడా పనిచేశారు. ప్రస్తుతం డీసీఆర్బీ ఎస్ఐగా ఉన్నారు. ఆమె మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
News February 4, 2025
KNR: అధికారుల సెలవు దరఖాస్తుకు ప్రత్యేక పోర్టల్
వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారులు, ఉద్యోగుల సెలవు దరఖాస్తు, మంజూరు విధానం ఆన్లైన్లో నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపొందించింది. టీం ఇండియా సంస్థ సీఈవో చైతన్య ఆధ్వర్యంలో ఈ లీవ్ మేనేజ్మెంట్ పోర్టల్ సాఫ్ట్వేర్ తయారుచేసి మంగళవారం జిల్లా కలెక్టర్‌కు అందించారు. పేపర్‌వర్క్ తగ్గించేందుకు, సెలవు మంజూరులో పారదర్శకతకు ఈ పోర్టల్ రూపొందించినట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
News February 4, 2025
జగిత్యాల: SI శ్వేత మృతి బాధాకరం: ఎస్పీ
JGTL గొల్లపల్లి చిల్వకోడూరు వద్ద కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో జగిత్యాల జిల్లా పోలీస్ DCRBలో పనిచేస్తున్న ఎస్ఐ కొక్కుల శ్వేత మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్ఐ శ్వేత మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించగా ఆమె కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎస్ఐ శ్వేత మృతి చాలా బాధాకరమని తెలిపారు. శ్వేత మృతి పట్ల పోలీస్ అధికారులు సంతాపం తెలియజేశారు.