News April 12, 2025

KNR: ప్రశాంతంగా ముగిసిన బ్యాంకింగ్ ఉచిత శిక్షణ పరీక్ష

image

బీసీ స్టడీ సర్కిల్ కరీంనగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత శిక్షణ బ్యాంకింగ్ పరీక్ష శనివారం ప్రశాంతంగా ముగిశాయి. పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు గంట ముందే చేరుకున్నారు. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 11:00 నుంచి మధ్యాహ్నం 01:00 గంటల వరకు ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ.. ఉచిత శిక్షణ పరీక్షకు మొత్తం 67 మంది హాజరైనట్టు తెలిపారు.

Similar News

News April 13, 2025

KNR జిల్లాలో దంచికొడుతున్న ఎండ

image

KNR జిల్లాలో ఎండ దంచికొడుతోంది. గడచిన 24 గంటల్లో అత్యధికంగా జమ్మికుంట మండలంలో 42.3°C నమోదు కాగా, మానకొండూర్ 42.3, గంగాధర 42.1, రామడుగు 41.9, తిమ్మాపూర్ 41.6, KNR 41.5, చొప్పదండి 41.4, చిగురుమామిడి 41.2, KNR రూరల్ 41.0, శంకరపట్నం, గన్నేరువరం 40.9, కొత్తపల్లి 40.5, వీణవంక 40.4, హుజూరాబాద్ 40.3, సైదాపూర్, ఇల్లందకుంట 39.6°C గా నమోదైంది. కాగా, మధ్యాహ్నం సమయంలో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు.

News April 13, 2025

కరీంనగర్: BRS సిద్ధమా..పూర్వ వైభవం వచ్చేనా..!

image

రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత స్తబ్దుగా ఉన్న BRS రజతోత్సవ సభ ఏర్పాటు చేస్తుండటంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. KNR, HZBD ఎమ్మెల్యేలు, చొప్పదండి, మానకొండూరు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సభకు భారీగా తరలివెళ్లి పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా సమాయత్తమవుతున్నారు. ఇది స్థానిక పోరుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఈ సభ బీఆర్‌ఎస్‌కు కీలకం కానుంది.

News April 13, 2025

కరీంనగర్: ఢీకొన్న ఆర్టీసీ బస్సు, లారీ, కారు

image

శంకరపట్నంలో శనివారం సాయంత్రం ఓ లారీ RTC బస్సును ఢీకొనడంతో అది వెళ్లి కారును ఢీకొంది. తాడికల్ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై KNR నుంచి WGL వైపు వెళ్తున్న మెట్‌పల్లి డిపో RTC బస్సు ముందు వెళ్తున్న లారీని ఓవర్ టేక్ చేస్తుండగా లారీ ఢీకొట్టింది. అదే సమయంలో HZBD నుంచి KNR వైపు ఎదురుగా వస్తున్న ఓ కారును ఈ బస్సు ఢీకొంది. బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. వారందరూ సురక్షితంగా బయటపడ్డారు.

error: Content is protected !!