News April 25, 2024
కొడాలి నాని 10th ఫెయిల్

AP: గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఆస్తుల విలువ రూ.16 కోట్లుగా ఉంది. అందులో చరాస్తులు రూ.3.20 కోట్లు కాగా స్థిరాస్తులు రూ.12.80 కోట్లు. ఇక అప్పులు రూ.4.92 కోట్లు ఉన్నట్లు ఆయన ఎన్నికల అఫిడవిట్‌లో తెలిపారు. నాని వద్ద రూ.8.50 లక్షల విలువ చేసే 340 గ్రాముల బంగారం, ఆయన భార్య అనుపమ వద్ద రూ.45 లక్షలు విలువ చేసే 1800 గ్రాముల బంగారం ఉంది. 1987లో నాని పదో తరగతి ఫెయిల్ అయ్యారు. ఆయనపై ఒక క్రిమినల్ కేసు ఉంది.
Similar News
News January 13, 2026
చైనా మాంజాపై పోలీసు కమిషనర్‌కు HRC నోటీసులు

TG: గాలిపటాలు ఎగురవేసేందుకు వినియోగిస్తున్న చైనా మాంజా కారణంగా పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు. తీవ్రంగా గాయపడి కొన్నిచోట్ల పిల్లల ప్రాణాలూ పోతున్నాయి. దీనిపై దాఖలైన ఫిర్యాదుతో తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) సీరియస్‌గా స్పందించింది. HYD పోలీసు కమిషనర్ సజ్జనార్‌కు నోటీసులు జారీచేసింది. ఈ ఘటనలపై నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అడ్వకేట్ రామారావు ఇమ్మానేని HRCలో ఈ పిటిషన్ దాఖలు చేశారు.
News January 13, 2026
Xలో సాంకేతిక సమస్య!

సోషల్ మీడియా మాధ్యమం X(ట్విటర్)లో సాంకేతిక సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. యాప్ లోడ్ అవట్లేదని నెటిజన్లు చెబుతున్నారు. ఒక వేళ ప్రయత్నిస్తే Retry అని డిస్ ప్లే అవుతుందని అంటున్నారు. అయితే ఈ సమస్య భారత్‌లోనే ఉందా ఇతర దేశాల్లోనూ ఉందా అనేది తెలియాల్సి ఉంది. మీకు ఇలాంటి సమస్య ఎదురవుతుందా? కామెంట్.
News January 13, 2026
TCSలో మరిన్ని ఉద్యోగాల కోత!

TCSలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. 6 నెలల్లో 30 వేల మందిని ఇంటికి పంపిన కంపెనీ అవసరమైతే మరింత మందిని తీసేస్తామని చెప్పింది. ‘నంబర్ ఇంత అని నిర్ణయించలేదు. కానీ వచ్చే త్రైమాసికంలోనూ తొలగింపులు ఉంటాయి. సరైన కారణం, అంతర్గత ఆడిట్ ద్వారానే ఇవి జరుగుతాయి’ అని తెలిపింది. ప్రస్తుతం TCSలో 5,82,163 మంది పని చేస్తున్నారు. సెప్టెంబర్ క్వార్టర్‌లో 19,755 మంది, డిసెంబర్ క్వార్టర్‌లో 11,151 మందిని తీసేసింది.


