News March 26, 2025
కొడాలి నాని ఆరోగ్యంపై స్పందించిన ఆయన టీమ్

AP:వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ఆరోగ్యంపై వచ్చిన వార్తల విషయంలో ఆయన టీమ్ ట్విటర్లో స్పందించింది. ‘కొడాలి నాని గారు గ్యాస్ట్రిక్ సమస్యతో ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన క్షేమంగా ఉన్నారు’ అని వెల్లడించింది. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈరోజు ఉదయం ఆయనకు గుండెపోటంటూ వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
Similar News
News January 21, 2026
నైనీ బొగ్గు టెండర్లపై కేంద్రం అత్యవసర సమీక్ష

TG: నైనీ బొగ్గు టెండర్ల వివాదంపై CM రేవంత్, Dy CM భట్టి, మంత్రి వెంకట్‌రెడ్డిలపై BRS ఆరోపణలు చేయడం తెలిసిందే. ఈ కుంభకోణంలో పాత్ర లేకపోతే విచారణ చేయించాలని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డికి హరీశ్ సవాల్ విసిరారు. ఈ తరుణంలో మంత్రి ఆదేశాలతో కేంద్ర బొగ్గు, గనుల శాఖ అధికారులు అత్యవసర భేటీ నిర్వహిస్తున్నారు. నైనీతోపాటు ఇతర బొగ్గు బ్లాక్‌లపైనా సమీక్షించి తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
News January 21, 2026
రేపు ఎంపీలతో జగన్ భేటీ

AP: వైసీపీ అధినేత జగన్ రేపు తమ పార్టీ ఎంపీలతో భేటీ కానున్నారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. మెడికల్ కాలేజీల పీపీపీ విధానం, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నారు. అటు ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలతో నేడు జగన్ సమావేశమై తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.
News January 21, 2026
మేడారం.. నేడు ‘మండమెలిగే’ పండుగ

TG: మేడారం జాతరలో ‘మండమెలిగే’ ఘట్టం జరగనుంది. గ్రామంలోని సమ్మక్క ఆలయాన్ని, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాన్ని ఆదివాసీ పూజారులు పవిత్ర జలాలతో శుద్ధి చేస్తారు. మేడారం వీధుల్లో, ఆలయ పరిసరాల్లో పచ్చని తోరణాలు కడతారు. దీంతో ఇవాళ రాత్రి దర్శనాలు నిలిపివేశారు. పూర్వం అగ్ని ప్రమాదాలతో దగ్ధమైన ఆలయ గుడిసెలను జాతరకు వారం ముందు కొత్త కొమ్మలతో శుద్ధి చేసి పునర్నిర్మించేవారు. దీంతో ‘మండమెలిగే’ అని పేరు వచ్చింది.


