News August 16, 2024
ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన కోదండరామ్, అలీఖాన్
TG: ఎట్టకేలకు TJS అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ శాసనమండలిలో అడుగుపెట్టారు. గవర్నర్ కోటాలో ఆయనతో పాటు అలీఖాన్ MLCలుగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొన్న కోదండరామ్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్తో విభేదించారు. తెలంగాణ జనసమితి పార్టీని స్థాపించి, అప్పటి ప్రభుత్వంపై పోరాడారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతో కోదండరామ్‌కు MLC పదవి ఇచ్చి గౌరవించింది.
Similar News
News January 15, 2025
ITR దాఖలుకు ఇవాళే చివరి తేదీ
2023-24కు గాను ఐటీఆర్ ఫైలింగ్‌కు ఇవాళే చివరి తేదీ. లేట్, రివైజ్డ్ రిటర్న్స్‌ను రాత్రి 12 గంటల్లోపు దాఖలు చేయాలి. ఇప్పటికే ఓసారి గడువు పొడిగించినందున మరోసారి అవకాశం ఉండకపోవచ్చు. మొత్తం ఆదాయం రూ.5 లక్షల లోపు ఉంటే రూ.1,000, రూ.5 లక్షల కంటే ఎక్కువ ఉంటే రూ.5,000 ఆలస్య రుసుము చెల్లించాలి. నేడు ITR దాఖలు చేయకపోతే లీగల్ నోటీసులు, జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
News January 15, 2025
ఆకట్టుకుంటున్న ‘మిరాయ్’ పోస్టర్
కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో యంగ్ హీరో తేజా సజ్జా నటిస్తున్న ‘మిరాయ్’ నుంచి మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. చుట్టూ పురాతన దేవాలయాలు, శిథిల భవనాల మీదుగా హీరో ఎగురుతున్నట్లుగా ఉన్న ఈ ఫొటో మూవీపై ఆసక్తిని పెంచుతోంది. ‘గత సంక్రాంతికి ఎగరడం ప్రారంభించా. మీ ప్రేమతో ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నా’ అని తేజ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. గత ఏడాది రిలీజైన ‘హనుమాన్’ సూపర్ హిట్టయిన విషయం తెలిసిందే.
News January 15, 2025
ధూమపానం, మద్యపానం, అధిక బరువుతో అనేక క్యాన్సర్లు!
ధూమపానం, మద్యపానానికి బానిసలై ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మద్యం సేవించడాన్ని మానేస్తే క్యాన్సర్‌ను నివారించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. అధిక బరువు వల్ల 13 రకాల క్యాన్సర్లు, స్మోకింగ్ వల్ల ఏ భాగంలోనైనా క్యాన్సర్ రావొచ్చని తెలిపారు. ఆల్కహాల్ వల్ల స్వరపేటిక, అన్నవాహిక, కాలేయం, పెద్దపేగు క్యాన్సర్ వస్తుంది. అందుకే వీటిని మానేసి పౌష్టికాహారం తీసుకుంటే క్యాన్సర్ దరిచేరదంటున్నారు.