News September 23, 2024
కోదండరాంకు రేపు TJAC సన్మానం

TJAC ఆధ్వర్యంలో ఈ నెల 24న MLC కోదండరాంను సన్మానించనున్నారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, సంఘాలను ఏకతాటిపైకి తెచ్చిన అప్పటి తమ ఛైర్మన్ కోదండరాం కృషి మరువలేనిదని JAC నేతలు అభిప్రాయపడ్డారు. స్వరాష్ట్రం ఏర్పాటైన పదేళ్ల తర్వాత ఆయనకు MLC ఇవ్వడం అభినందనీయమన్నారు. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, గెజిటెడ్, పంచాయతీ కార్యదర్శులు, గ్రూప్-1 ఇలా 205 సంఘాలతో JAC ఏర్పాటైందని గుర్తు చేశారు.
Similar News
News November 20, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.170 తగ్గి రూ.1,24,690కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.150 పతనమై రూ.1,14,300 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.3,000 తగ్గి రూ.1,73,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News November 20, 2025
బొప్పాయి కోత, రవాణాలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

బొప్పాయిని దూరంగా ఉండే మార్కెట్లకు పంపాలంటే వాటిపై ఆకుపచ్చ రంగు నుంచి 1,2 పసుపు చారలు రాగానే కోయాలి. దగ్గరి మార్కెట్లలో విక్రయించాలంటే కొంచెం మాగిన కాయలను కోయాలి. బొప్పాయిని కోశాక పాలు ఆరేవరకు నీడలో ఉంచాలి. లేకుంటే కాయలపై మచ్చలు పడి నాణ్యత దెబ్బతింటుంది. కాయలకు విడివిడిగా న్యూస్ పేపర్ చుట్టి ప్యాకింగ్ చేయాలి. బొప్పాయి రవాణా చేసే వాహనాల అడుగున, పక్కల వరిగడ్డి పరిస్తే నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది.
News November 20, 2025
కోచింగ్ సెంటర్లో ప్రేమ.. విడాకులు!

iBOMMA నిర్వాహకుడు రవి వ్యక్తిగత జీవితం గురించి పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమీర్పేట్లోని ఓ కోచింగ్ సెంటర్లో పరిచయమైన ముస్లిం యువతిని రవి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. వారికి ఓ పాప ఉంది. విదేశాల్లో ఉన్న తన అక్క, బావ రూ.కోట్లు సంపాదిస్తుంటే, నీకు డబ్బు సంపాదించడం చేతకావట్లేదని రవి భార్య, అత్త ఎగతాళి చేసేవారని దర్యాప్తులో తేలింది. 2021లో విడాకులు కాగా పాపను భార్య తీసుకెళ్లినట్లు తేలింది.


