News April 14, 2025
అశ్వవాహనంపై కోదండరాముడు

AP: కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఇవాళ రాత్రి అశ్వవాహనంపై దర్శనమిచ్చారు. అంతకుముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో అలరించారు. అశ్వవాహనంపై స్వామిని చూస్తూ భక్తులు శ్రీరామనామ స్మరణలతో పరవశించిపోయారు.
Similar News
News November 8, 2025
అణ్వాయుధ దేశంగా పాక్.. ఇందిర నిర్ణయమే కారణం: మాజీ CIA

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నిర్ణయం వల్లే పాక్ అణ్వాయుధ దేశంగా మారిందని US CIA మాజీ ఆఫీసర్ రిచర్డ్ బార్లో వెల్లడించారు. ‘భారత్, ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ చేసి ఇస్లామాబాద్ కహుతా అణు తయారీ కేంద్రంపై దాడికి సిద్ధమయ్యాయి. దీనికి అప్పటి ప్రధాని ఇందిర అంగీకరించలేదు. ఈ దాడి జరిగి ఉంటే చాలా సమస్యలు పరిష్కారమయ్యేవి. పాక్ అణ్వాయుధాలు తయారు చేసేది భారత్‌ను ఎదుర్కొనేందుకే’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
News November 8, 2025
₹5,942 కోట్లతో సోలార్ సెల్, మాడ్యూళ్ల ప్రాజెక్టు: లోకేశ్

TGకి చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ₹5,942 కోట్లతో దేశంలోనే రెండో అతిపెద్ద సోలార్ సెల్, మాడ్యూళ్ల ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. దీనికోసం 2005లో నాయుడుపేట ఇండస్ట్రీయల్ పార్కులో 269 ఎకరాలు కేటాయించామన్నారు. 5GW సిలికాన్ ఇంగోట్, 4GW టాప్‌కాన్ సోలార్ సెల్ యూనిట్లు నెలకొల్పుతారని చెప్పారు. వీటిని 7GWకి విస్తరిస్తారన్నారు. దీనిద్వారా 3500మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.
News November 8, 2025
DEC 1 నుంచి పార్లమెంట్ సమావేశాలు

డిసెంబర్ 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపినట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసేలా, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నిర్మాణాత్మక చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.


