News July 19, 2024
గంభీర్ విషయంలో బోర్డుకు కోహ్లీ భరోసా

గంభీర్, కోహ్లీ ఇటీవల కలిసిపోయినట్లు కనిపిస్తున్నా టీం ఇండియాకు సంబంధించి ఒకే ఒరలో ఈ రెండు కత్తులు ఎలా కలిసుంటాయా అన్న అనుమానాలున్నాయి. బీసీసీఐ పెద్దలు కూడా ఇదే మీమాంసలో ఉండగా, ఏం పర్లేదంటూ కోహ్లీ వారికి చెప్పారట. ‘గంభీర్తో జరిగిన గత ఘటనలేవీ మా బంధంపై ప్రభావం చూపించవు. ఇద్దరం కలిసి భారత జట్టుకోసమే శ్రమిస్తాం. ఇందులో ఎటువంటి భయాలూ అక్కర్లేదు’ అని విరాట్ చెప్పారని బోర్డు వర్గాలు వెల్లడించాయి.
Similar News
News November 22, 2025
బోయినపల్లి: PHCని తనిఖీ చేసిన ఇన్ఛార్జ్ కలెక్టర్

బోయినపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగర్వాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది హాజరు, ఓపీ, మందుల రిజిస్టర్, వ్యాక్సిన్ గది, మందులు ఇచ్చే గదిని ఆమె పరిశీలించారు. దవాఖానలో అందుతున్న వైద్య సేవలపై రోగుల నుంచి ఇన్ఛార్జ్ కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News November 22, 2025
సత్యసాయి బోధనలు లక్షల మందికి మార్గం చూపాయి: ముర్ము

AP: విశ్వప్రేమకు ప్రతిరూపంగా సత్యసాయి జీవించారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ఆయన బోధనలు లక్షల మందికి మార్గం చూపాయని పేర్కొన్నారు. సత్యసాయి మహాసమాధిని దర్శించుకోవడం తన అదృష్టమని తెలిపారు. ట్రస్టు ద్వారా ఎంతో మందికి వైద్య సేవలు అందించారని, ఆయన సందేశంతో అనేక మందిని సేవామార్గంలో నడిపించారన్నారు.
News November 22, 2025
తొలి టెస్టులో ఆసీస్ ఘన విజయం

ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 205 రన్స్ టార్గెట్ను ఆసీస్ 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ENG బౌలర్లను ఓపెనర్ హెడ్ ఊచకోత కోశారు. కేవలం 83 బంతుల్లోనే 123 రన్స్ బాదారు. లబుషేన్ 51* రన్స్తో రాణించారు.
స్కోర్స్: ENG- 172, 164.. AUS- 132, 205/2


