News October 23, 2024
పుణేలో కోహ్లీ సగటు 133.50.. రేపు కూడా రిపీట్ చేస్తారా?

మహారాష్ట్రలోని పుణే MCA స్టేడియంలో కింగ్ విరాట్ కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. అక్కడ 2 టెస్టుల్లో 3 ఇన్నింగ్స్లు ఆడిన విరాట్ 267 రన్స్ చేశారు. అత్యధిక స్కోర్ 254*గా ఉంది. యావరేజ్ 133.50 కావడం విశేషం. మరి రేపు NZతో ప్రారంభమయ్యే రెండో టెస్టులో కోహ్లీ ఎలా విజృంభిస్తారో చూడాలి.
Similar News
News November 22, 2025
ఇంటర్ అర్హతతో 3,058 పోస్టులు.. అప్లై చేశారా?

రైల్వేలో 3,058 అండర్ గ్రాడ్యుయేట్ నాన్ టెక్నికల్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఇంటర్ అర్హతగల వారు ఈనెల 27 వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు18- 30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500. SC,ST, PwBD, మహిళలకు రూ.250. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 22, 2025
రాష్ట్రంలో 78 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 78 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి MBBS,MD,MS,DNB,PG డిగ్రీ, పీజీ డిప్లొమా, DM,M.CH,MSC, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. జీతం నెలకు రూ.లక్ష నుంచి రూ.1,90,000 వరకు చెల్లిస్తారు. వెబ్సైట్: https://rajannasircilla.telangana.gov.in./
News November 22, 2025
నేడు భారీ సంఖ్యలో లొంగిపోనున్న మావోయిస్టులు

TG: మావోయిస్టు పార్టీకి మరో షాక్ తగిలింది. ఈ రోజు 37 మంది మావోయిస్టులు రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోనున్నారు. అందులో కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులైన ఆజాద్, అప్పాసి నారాయణ, ఎర్రాలు తదితర ముఖ్య నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. మ.3 గంటలకు డీజీపీ మీడియా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించనున్నారు.


