News May 26, 2024
బంగ్లాతో వామప్ మ్యాచ్‌కు కోహ్లీ దూరం?

టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా జూన్ 1న బంగ్లాదేశ్‌తో జరగబోయే వామప్ మ్యాచ్‌కు టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. వీసా అపాయింట్‌మెంట్, IPL ప్లేఆఫ్స్‌లో RCB నిష్క్రమణ వంటి కారణాలతో కోహ్లీ ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండరని సమాచారం. ఇప్పటికే టీమ్ ఇండియా ఫస్ట్ బ్యాచ్‌లో రోహిత్, బుమ్రా, సూర్య, కుల్దీప్, అర్ష్‌దీప్ తదితర క్రికెటర్లు అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.
Similar News
News February 7, 2026
TENTH: ఇంగ్లిష్ ఎగ్జామ్ తేదీ మార్పు

AP: టెన్త్ పబ్లిక్ పరీక్షల తేదీల్లో స్వల్ప మార్పు జరిగింది. ఇంగ్లిష్ పరీక్షను మార్చి 20న కాకుండా 21న (శనివారం) నిర్వహించనున్నట్లు ఎస్సెస్సీ బోర్డు అధికారికంగా ప్రకటించింది. 20న రంజాన్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. మిగతా అన్ని పరీక్షలు ముందుగా ప్రకటించిన టైమ్ టేబుల్ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని స్పష్టం చేసింది. కాగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి.
News February 7, 2026
ముంబై: బీజేపీకి మేయర్, శివసేనకు డిప్యూటీ మేయర్

ముంబై మేయర్‌గా బీజేపీ కార్పొరేటర్ రితూ తావ్డే పేరును ఆ పార్టీ ప్రకటించింది. డిప్యూటీ మేయర్‌గా శివసేన కార్పొరేటర్ సంజయ్ శంకర్ ఘాడీని ఎంపిక చేశారు. కాగా 227 స్థానాలు ఉన్న ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో మహాయుతి కూటమి 118 చోట్ల (బీజేపీ- 89, శివసేన- 29) విజయం సాధించింది. దీంతో 25 ఏళ్ల తర్వాత ముంబై పీఠంపై శివసేన (UBT) పట్టు కోల్పోయింది.
News February 7, 2026
TISSలో ఉద్యోగాలు

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(<


