News July 1, 2024
ఇన్‌స్టాగ్రామ్‌లో చరిత్ర సృష్టించిన కోహ్లీ

టీ20 వరల్డ్ కప్‌ను టీమ్ఇండియా గెలుపొందడంపై విరాట్ కోహ్లీ చేసిన ఇన్‌స్టా పోస్ట్ రికార్డు సృష్టించింది. కప్‌తో, టీమ్‌తో ఉన్న ఫొటోలతో ‘ఇంతకంటే మంచి రోజు వస్తుందని కలలో కూడా ఊహించలేదు’ అని పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు ఇప్పటివరకు 18 మిలియన్ల లైక్స్‌తో పాటు 6.6 లక్షల కామెంట్స్ వచ్చాయి. గతంలో కియారా, సిద్ధార్థ్ పేరిట ఉన్న రికార్డును సైతం బ్రేక్ చేసింది. WC ఫైనల్‌లో కోహ్లీ 76 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
Similar News
News February 21, 2025
శివరాత్రి జాతరకు ఘనంగా ఏర్పాట్లు

TG: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయం శివరాత్రి వేడుకకు ముస్తాబవుతోంది. ఈ నెల 25,26,27 తేదీలలో జాతర నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాల కోసం గుడి చెరువు మైదానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిప్పాపూర్ బస్టాండ్ నుంచి ప్రధాన ఆలయం వరకూ ఉచిత బస్సులను నడపనున్నట్లు అధికారులు తెలిపారు. 2వేల మంది పోలీసులతో బందోబస్తు చేపట్టనున్నారు.
News February 21, 2025
మా దేశంలో ఉండొద్దు.. బీబీసీకి అజెర్‌బైజాన్ ఆదేశాలు

తమ దేశంలోని కార్యాలయాలు మూసేసి వెళ్లిపోవాలని వార్తాసంస్థ బీబీసీని అజెర్‌బైజాన్ ఆదేశించింది. తమ చట్టప్రకారం కార్యాలయం నడిపే హక్కు ఆ సంస్థకు లేదని తేల్చిచెప్పింది. దీంతో తమ కార్యాలయం మూసేయక తప్పలేదని, మీడియా స్వేచ్ఛను అజెర్‌బైజాన్ తుంగలో తొక్కిందని బీబీసీ ఓ ప్రకటనలో ఆరోపించింది. బీబీసీ ఆ దేశంలో 1994 నుంచి పనిచేస్తోంది. మరోవైపు.. BBC ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తోందని అజెర్‌బైజాన్ మండిపడింది.
News February 21, 2025
టెన్త్ అర్హతతో 32,438 ఉద్యోగాలు.. గడువు పొడిగింపు

రైల్వేలో 32,438 గ్రూప్-డీ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు రేపటితో ముగియాల్సి ఉండగా RRB మరో వారం రోజులు పొడిగించింది. మార్చి 1 వరకు అప్లై చేసుకోవచ్చు. 4-13 వరకు కరెక్షన్ విండో ఓపెన్‌లో ఉంటుంది. టెన్త్/ITI పాసై, 18-36 ఏళ్ల వయసున్న వారు అర్హులు. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/