News March 27, 2024

ఐపీఎల్ ట్రోఫీ గెలిచేందుకు కోహ్లీ అర్హుడు: బ్రాడ్

image

ఆర్సీబీకి ఐపీఎల్ ట్రోఫీ అందించే అర్హత విరాట్ కోహ్లీకి ఉందని ఇంగ్లండ్ మాజీ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ అభిప్రాయపడ్డారు. ‘తను ఇప్పుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఫినిషర్లలో ఒకరు. రెండు నెలల విరామంతో చాలా తాజాగా కనిపిస్తున్నారు. క్రికెట్ అభిమానులందరూ విరాట్ ఐపీఎల్ ట్రోఫీ గెలవాలని కోరుకుంటున్నారు. అది ఈ ఏడాదే కావచ్చు లేదా మరి కొన్నేళ్లు కావొచ్చు కానీ ఆ ట్రోఫీకి తను అర్హుడు’ అని వ్యాఖ్యానించారు.

Similar News

News March 5, 2026

కడప: ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 5,236 మంది హాజరు.!

image

కడప జిల్లాలో గురువారం 34 కేంద్రాల్లో ఓపెన్ ఇంటర్ తెలుగు, హిందీ, ఉర్దు పరీక్షలు నిర్వహించారు. నేడు 5,783 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా.. 5,326 మంది విద్యార్థులు హాజరయ్యారు. 711 మంది గైర్హాజరయ్యారు. తెలుగు 5,086 మంది, హిందీ 68 మంది, ఉర్దు పరీక్ష 82 మంది రాశారు. డీఈఓ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఓపెన్ ఇంటర్ పరీక్షలను నిర్వహించారు.

News March 5, 2026

ప్రపంచంలో రద్దీగా ఉండే జలసంధులు ఇవే..

image

వివిధ ఖండాల మధ్య ఉన్న జలసంధుల ద్వారా చమురు రవాణా సాగుతుంటుంది. ఇందులో మలక్కా జలసంధి అతి ముఖ్యమైనది. ఇండోనేషియా దీవుల్లో ఉండే ఈ సంధి ద్వారా రోజుకు 23.2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ సరఫరా అవుతుంది. ఆ తర్వాత ఇరాన్ దగ్గరలోని హార్ముజ్ (20.9 M), సౌతాఫ్రికా కింద ఉన్న కేప్ ఆఫ్ గుడ్ హోప్ (9.1 M), ఈజిప్ట్ సూయిజ్ కెనాల్ (4.9 M), డానిష్ సంధి (4.9 M) ఉన్నాయి. తాజా యుద్ధంతో హార్ముజ్‌ను మూసివేశారు.

News March 5, 2026

హైదరాబాద్ CCMBలో ఉద్యోగాలు

image

HYDలోని<> CCMB<<>> 3 Sr. ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులను భర్తీ చేయనుంది . అర్హతగల వారు మార్చి 17న ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. పోస్టును బట్టి PG(నేచురల్ సైన్స్), BE/BTech, MBBS, ఫార్మసీ, PhD(బయోఇన్ఫర్మాటిక్స్/ జెనిటిక్స్/ లైఫ్ సైన్స్), డిగ్రీ(మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, వైరాలజీ, మాలిక్యులార్ బయాలజీ) అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. సైట్: www.ccmb.res.in