News March 20, 2025

కోహ్లీకి 2008లో రూ.12 లక్షలు.. ఇప్పుడు రూ.21కోట్లు

image

ఐపీఎల్ ఎంతో మంది యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసింది. 2008 నుంచి బెంగళూరు తరఫున ఆడుతున్న కోహ్లీ తొలి టోర్నీలో రూ.12 లక్షలు పొందితే ఇప్పుడు రూ.21 కోట్లు అందుకోనున్నారు. ముంబై జట్టు ప్లేయర్ రోహిత్ శర్మ రూ.3 కోట్ల నుంచి రూ.16 కోట్లకు చేరారు. ఇక 2008లో ధోనీకి ఉన్న క్రేజ్‌కు ఏకంగా రూ.6కోట్లు ఇవ్వగా ఇప్పుడు రూ.4కోట్లిస్తున్నారు. తొలి టోర్నీ నుంచి రహానే, మనీశ్, ఇషాంత్, జడేజా, అశ్విన్ కూడా ఉన్నారు.

Similar News

News October 31, 2025

VIRAL: అప్పుడు గంభీర్.. ఇప్పుడు జెమీమా

image

ఉమెన్స్ ODI వరల్డ్ కప్ సెమీస్‌లో ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన జెమీమా రోడ్రిగ్స్‌ను నెటిజన్లు గంభీర్‌తో పోలుస్తున్నారు. 2011 WC ఫైనల్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన గంభీర్ 97 రన్స్ చేసి IND విజయంలో కీలక పాత్ర పోషించారు. నిన్నటి మ్యాచులో జెమీమా సైతం మూడో స్థానంలోనే బ్యాటింగ్ చేశారు. ఇద్దరి జెర్సీ నంబర్ ఒకటే కావడం(5), ఇద్దరి జెర్సీలకు మట్టి ఉండటంతో వారి ఫొటోలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.

News October 31, 2025

తథాస్తు దేవతలు నిజంగానే ఉంటారా..?

image

హిందూ సంప్రదాయం ప్రకారం.. అసుర సంధ్యా వేళలో ‘చారణులు’ అనే దేవతలు ఆకాశంలో సంచరిస్తూ ఉంటారట. ఈ సమయంలో మనం ఏం మాట్లాడినా వారు ‘తథాస్తు’ అని దీవిస్తారని పండితులు చెబుతున్నారు. అందుకే సాయంకాలం చెడు మాటలు మాట్లాడొద్దని మన పెద్దలు చెబుతుంటారు. మట్లాడేటప్పుడు తొలుత మనం చెడు మాట పలికితే.. ఆ దేవతలు పూర్తి మాట వినకుండా ఆ మొదటి మాటకే ‘తథాస్తు’ అనేస్తారట. అందుకే సాయంత్రం వేళ మంచి మాత్రమే మాట్లాడాలి.

News October 31, 2025

ఫిజికల్ రీసెర్చ్ ల్యాబ్‌లో 30 ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీలో 30 టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్-B పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఐటీఐ, డిప్లొమా అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 18 నుంచి 35ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తు ఫీజు రూ.750. వెబ్‌సైట్: https://www.prl.res.in/