News September 12, 2024

చరిత్ర సృష్టించేందుకు 58 రన్స్ దూరంలో కోహ్లీ

image

క్రికెటర్ విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుకు సమీపంలో ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు అంతర్జాతీయంగా 591 ఇన్నింగ్స్‌లో 26,952 పరుగులు చేశారు. మరో 58 పరుగులు చేస్తే అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 27వేల పరుగుల్ని చేరుకున్న తొలి ఆటగాడిగా నిలుస్తారు. ప్రస్తుతం సచిన్‌ టెండూల్కర్(623 ఇన్నింగ్స్‌) పేరిట ఆ రికార్డు ఉంది. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో సచిన్, పాంటింగ్, సంగక్కర మాత్రమే 27వేలకు పైగా రన్స్ చేశారు.

Similar News

News August 28, 2025

భారీ వర్షాలు.. పలు రైళ్ల రద్దు

image

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇవాళ కాచిగూడ-నాగర్సోల్, కాచిగూడ-కరీంనగర్, కరీంనగర్-కాచిగూడ, మెదక్-కాచిగూడ, బోధన్-కాచిగూడ, కాచిగూడ-నర్ఖేడ్, నాందేడ్-మేడ్చల్ ట్రైన్లను, రేపు నర్ఖేడ్-కాచిగూడ, నాగర్సోల్-కాచిగూడ రైళ్ల సేవలు రద్దు చేసినట్లు పేర్కొంది. పలు రైళ్లు దారి మళ్లింపు, పాక్షికంగా క్యాన్సిల్ చేసినట్లు వివరించింది.

News August 28, 2025

కొనసాగుతున్న అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఇవాళ అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మన్యం, కోనసీమ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడులో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అల్పపీడనం ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వైపు కదిలే అవకాశం ఉందని వివరించింది.

News August 28, 2025

అమెరికాలో భారత వస్తువుల ధరలు పెంపు!

image

భారత్‌పై ట్రంప్ <<17529585>>టారిఫ్<<>> ఎఫెక్ట్ అమెరికాలో ధరలపై ప్రభావం చూపుతున్నాయి. టారిఫ్ పెంపుతో భారత వస్తువుల ధరలు 40-50శాతం పెంచుతున్నట్లుగా అమెరికాలోని గ్రాసరీ షాపుల ఎదుట పోస్టర్లు వెలిశాయి. దీంతో ఎన్ఆర్ఐలు, భారతీయ స్టూడెంట్లపై భారం పడే అవకాశముంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును వ్యతిరేకిస్తూ ట్రంప్ టారిఫ్ ఆంక్షలకు దిగారు. నిన్నటి నుంచి భారత్ ఎగుమతులపై 50శాతం టారిఫ్స్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.