News March 2, 2025
కోహ్లీ నిజమైన స్ఫూర్తి: పాక్ ప్లేయర్

పాకిస్థాన్‌తో మ్యాచులో గిల్‌ను ఔట్ చేసిన సమయంలో ఆ జట్టు ప్లేయర్ అబ్రార్ అహ్మద్ చేసిన ఓవరాక్షన్‌పై నెట్టింట విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే అబ్రార్ మాత్రం భారత స్టార్ ప్లేయర్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించారు. తన చిన్ననాటి హీరో కోహ్లీకి బౌలింగ్ చేయడం, ఆయన నుంచి ప్రశంసలు పొందడం కృతజ్ఞతగా ఉందని చెప్పారు. మైదానంలో, బయటా ఆయనే నిజమైన స్ఫూర్తి అని రాసుకొచ్చారు.
Similar News
News January 27, 2026
పిల్లల్లో ఈ లక్షణాలున్నాయా? థైరాయిడ్ కావొచ్చు

ప్రస్తుతం థైరాయిడ్ వ్యాధి పిల్లలకు కూడా వస్తోంది. పిల్లల్లో ఈ సమస్యను నివారించాలంటే లక్షణాలను గుర్తించడం చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. పిల్లలు అలసిపోయినట్లు అనిపించడం, తరచూ అనారోగ్యానికి గురికావడం, చర్మం, పొడిగా, నిర్జీవంగా మారడం, మలబద్ధకం, అజీర్ణం, థైరాయిడ్ గ్రంధి పరిమాణం పెరగడం, కళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
News January 27, 2026
అనుమతిస్తే అనసూయకు గుడి కడతాం: మురళీశర్మ

యాంకర్ అనసూయకు గుడి కడతామని పూజారి, ఫ్యాన్ మురళీ శర్మ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అనసూయ పర్మిషన్ తీసుకుంటామని ఓ ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. ఖుష్బూకు గుడి కట్టిన తరహాలోనే ఈ ఆలయాన్ని నిర్మిస్తామని చెప్పారు. శివాజీ-అనసూయ వివాదంలో మురళీశర్మ అనసూయ వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చారు. కాగా గుడి కడతామన్న వ్యాఖ్యలపై అనసూయ ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
News January 27, 2026
కవిత కొత్త పార్టీ పేరు ఇదేనా?

TG: సొంత పార్టీ పెడుతున్నానని ప్రకటించిన కవిత ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు పార్టీ పేరు, గుర్తు, విధివిధానాలపై ఆమె ఓ క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. ‘తెలంగాణా ప్రజా జాగృతి’ పేరు ఖరారు చేసినట్లు సమాచారం. తనకు సెంటిమెంట్‌గా ఉన్న జాగృతి పేరును పార్టీ పేరులో కొనసాగించాలని కవిత నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఉగాది నాటికి పార్టీ పేరును ప్రకటించే అవకాశముంది.


