News December 4, 2024
డాన్ బ్రాడ్మన్ రికార్డుకు చేరువలో కోహ్లీ

విరాట్ కోహ్లీ మరో రికార్డుకు చేరువయ్యారు. BGT సిరీస్లో మరో సెంచరీ చేస్తే వేరే దేశంలో అత్యధిక సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్మన్ రికార్డును సమం చేస్తారు. డాన్ ఇంగ్లండ్లో 11 సెంచరీలు చేశారు. ప్రస్తుతం కోహ్లీకి ఆస్ట్రేలియాలో 10 సెంచరీలున్నాయి. ఈ సిరీస్లో మరో రెండు సెంచరీలు చేస్తే బ్రాడ్మన్ను అధిగమిస్తారు. కాగా.. ఆస్ట్రేలియాలో కోహ్లీ 43 మ్యాచులాడి 54.20 సగటుతో 2710 రన్స్ చేశారు.
Similar News
News November 23, 2025
విశాఖలో నాన్వెజ్ ధరలు

విశాఖపట్నంలో ఆదివారం నాన్వెజ్ ధరలు గణనీయంగా పెరిగాయి. మటన్ కేజీ రూ.950కి, చికెన్ స్కిన్లెస్ రూ.280కి, విత్స్కిన్ రూ.250కి, శొంఠ్యాం కోడి రూ.300కి పలుకుతోంది. డజన్ గుడ్లు రూ.66కు లభిస్తున్నాయి. గత వారంతో పోలిస్తే అన్ని రేట్లు భారీగా పెరగడంతో కార్తీక మాసం ముగిసిన వెంటనే ఈ పెరుగుదల మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారింది.
News November 23, 2025
పశ్చిమ గోదావరి జిల్లాలో ఉద్యోగాలు

AP: పశ్చిమగోదావరి డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫీస్ 11 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈనెల 29వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, డిగ్రీ (సోషల్ వర్క్, సోషియాలజీ, సోషల్ సైన్సెస్, స్టాటిస్టిక్స్, మ్యాథ్స్), BCA, B.Ed, MSc, MSW ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://westgodavari.ap.gov.in/
News November 23, 2025
చలికాలంలో కర్లీ హెయిర్ ఇలా సంరక్షించండి

చలి కాలంలో బయటకు వెళ్లేటప్పుడు జుట్టును కవర్ చేసుకునేలా క్యాప్ ధరించడం, స్కార్ఫ్ కట్టుకోవడం మంచిది. ముఖ్యంగా కర్లీ హెయిర్ త్వరగా పొడిబారిపోతుందంటున్నారు నిపుణులు. హెయిర్ సీరమ్, కండిషనర్లు, క్లెన్సర్లలో కాస్త తేనె కలిపి రాసుకోవడం, కొబ్బరి, బాదం, ఆలివ్ నూనెలతో మసాజ్ చేయడం వల్ల జుట్టు తేమగా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ప్రతి మూడు నెలలకోసారి చిట్లిన చివర్లను కత్తిరిస్తూ ఉండాలని సూచిస్తున్నారు.


