News February 25, 2025
వన్డేల్లో కోహ్లీనే ఉత్తమ ప్లేయర్: పాంటింగ్

పాకిస్థాన్‌తో మ్యాచులో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీపై ఆసీస్ మాజీ ప్లేయర్ పాంటింగ్ పొగడ్తల వర్షం కురిపించారు. వన్డే ఫార్మాట్లో విరాట్ కన్నా ఉత్తమ బ్యాటర్‌ను తాను చూడలేదని చెప్పారు. ఆయనలో పరుగుల దాహం ఉన్నంత వరకు ఫిట్‌గానే ఉంటారన్నారు. వన్డేల్లో సచిన్ అత్యధిక పరుగుల రికార్డును బ్రేక్ చేస్తారని అభిప్రాయపడ్డారు. పాక్‌తో జరిగిన మ్యాచులో కోహ్లీ 51వ ODI సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News November 20, 2025
వేములవాడ: భీమేశ్వరాలయంలో సీసీ కెమెరాలు ప్రారంభించిన MLA

వేములవాడ శ్రీ భీమేశ్వరస్వామి ఆలయంలో సీసీ కెమెరాలను ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆలయ భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన 35 సీసీ కెమెరాలు, 12 హ్యాండ్ మెటల్ డిటెక్టర్లు, 5 డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను అధికారులు MLA చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయించి ప్రారంభించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు.
News November 20, 2025
బండి సంజయ్‌పై పేపర్ లీకేజీ కేసు కొట్టివేత

TG: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై దాఖలైన టెన్త్ క్లాస్ పేపర్ లీకేజీ కేసును హైకోర్టు కొట్టేసింది. 2023లో పదో తరగతి హిందీ పేపర్ లీకేజీకి కారణమంటూ కమలాపూర్ PSలో ఆయనపై కేసు నమోదైంది. దీనిపై ఆయన HCని ఆశ్రయించగా సరైన సెక్షన్లు, ఆధారాలు లేవంటూ తాజాగా కేసును క్వాష్ చేసింది. మరోవైపు 2023 ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారంటూ మాజీ మంత్రి KTR, గోరటి వెంకన్నపై దాఖలైన FIRనూ HC కొట్టివేసింది.
News November 20, 2025
ఇతిహాసాలు క్విజ్ – 72 సమాధానాలు

నేటి ప్రశ్న: కురుక్షేత్రంలో కర్ణుడి రథ చక్రం నేలలో కూరుకు పోవడానికి, అది బయటకు రాకపోవడానికి కారణం ఏంటి?
జవాబు: ఓసారి కర్ణుడు భూమిపై పడిన నెయ్యిని తీస్తూ నెయ్యి తడిసిన మట్టిని చేతులతో బలంగా పిండాడు. ఈ చర్యతో బాధపడిన భూమాత ఆగ్రహించింది. ‘నువ్వు నాకు ఈ బాధకు కలిగించినందుకు ప్రతిచర్యగా నీ జీవితంలో అతి కీలకమైన యుద్ధ సమయంలో నీ రథ చక్రాన్ని నేలలో బలంగా పట్టుకుంటాను’ అని శపించింది.
<<-se>>#Ithihasaluquiz<<>>


