News December 18, 2024

కోహ్లీ ఒక్కడే మిగిలాడు!

image

మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో 2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన భారత జట్టులో ఒక్కరు మినహా మిగిలిన ప్లేయర్లంతా క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. నిన్నటి వరకు ఆల్‌రౌండర్ అశ్విన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ మాత్రమే యాక్టివ్ ప్లేయర్ల జాబితాలో ఉండేవారు. అయితే, ఇవాళ అశ్విన్ వీడ్కోలు పలకడంతో కేవలం కోహ్లీ ఒక్కడే మిగిలారు. ఈక్రమంలో అప్పటి WC ఫొటోలో కోహ్లీని హైలైట్ చేసిన ఫొటో వైరలవుతోంది.

Similar News

News January 3, 2026

వాట్సాప్‌లో న్యాయ సలహాలు, సమాచారం

image

కేంద్ర ప్రభుత్వం ‘న్యాయ సేతు’ సేవలను వాట్సాప్‌లోనూ అందిస్తోంది. 7217711814 నంబర్‌కి HI అని మెసేజ్ చేయగానే ‘Tele-Law’ చాట్‌బాట్ లీగల్ హెల్ప్/ఇన్ఫర్మేషన్/అసిస్టెన్స్ ఆప్షన్లు చూపిస్తుంది. మీకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకుని సేవలు పొందవచ్చు. ప్రజలకు లీగల్ హెల్ప్ అందించేందుకు 2024లో కేంద్రం ‘న్యాయ సేతు’ పేరిట డిజిటల్ ప్లాట్‌ఫామ్ తీసుకొచ్చింది. ఇప్పుడు దాని సేవలను వాట్సాప్‌కు ఎక్స్‌టెండ్ చేసింది.

News January 3, 2026

వరి మాగాణి మినుములో ఆకుమచ్చ తెగులు – నివారణ

image

ఆకుమచ్చ తెగులు సోకిన మినుము మొక్కల ఆకులపై చిన్న చిన్న గుండ్రని గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇవి తర్వాత పెద్ద మచ్చలుగా వలయాకారంగా ఏర్పడి ఆకులు ఎండి రాలిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి మాంకోజెబ్ 2.5 గ్రా. లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా. లేదా హెక్సాకోనజోల్‌ను 2.0 మి.లీటర్లను 10 రోజుల వ్యవధిలో 2 సార్లు మందులను మార్చి పిచికారీ చేయాలి. ముందుగా గట్ల మీద ఉన్న పైరుకు ఈ మందును పిచికారీ చేయాలి.

News January 3, 2026

పెళ్లికి ముందు శృంగారం నేరం.. ఏడాది జైలు శిక్ష

image

పెళ్లికి ముందు సహజీవనం, సెక్స్‌ను నేరంగా పరిగణించే చట్టం ఇండోనేషియాలో అమల్లోకి వచ్చింది 2023లోనే అక్కడి అధ్యక్షుడి ఆమోదం పొందిన ఈ బిల్లు తాజాగా చట్టరూపం దాల్చింది. పెళ్లికి ముందు సహజీవనానికి ఆరు నెలలు, పెళ్లికి ముందు సెక్స్‌ నేరానికి ఏడాది జైలు శిక్ష విధిస్తారు. అయితే, ఇది వ్యక్తుల ప్రైవసీని ఉల్లంఘించడమేనంటూ ఐరాస ఆందోళన వ్యక్తం చేసింది.