News July 11, 2024
కోహ్లీ ఇకపై ఎక్కువగా ఆడకపోవచ్చు: స్టెయిన్

రోహిత్ శర్మ, కోహ్లీ, జడేజా వంటి సీనియర్ల పట్ల టీమ్ఇండియా నూతన కోచ్ గంభీర్ కఠినంగా వ్యవహరిస్తారనేది విశ్లేషకుల అంచనా. ఈ క్రమంలో సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘కోహ్లీ వంటి కొందరు సీనియర్లు ఇకపై ఎక్కువ కాలం జట్టులో కొనసాగకపోవచ్చు. వాళ్లను పూర్తిగా పక్కన పెడతారని చెప్పలేను కానీ.. గంభీర్ కచ్చితంగా కఠినంగా ఉంటారనే అనిపిస్తోంది’ అని చెప్పారు.
Similar News
News November 12, 2025
APPLY NOW: CCRASలో ఉద్యోగాలు

సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (<
News November 12, 2025
షాహీన్.. పనులతో పరేషాన్!

ఉగ్రకుట్ర కేసులో <<18257542>>అరెస్టైన<<>> డా.షాహీన్ దేశంలో జైషే మహ్మద్ ఉమెన్స్ వింగ్‌ను నడిపిస్తోంది. ఉగ్ర సంస్థ మహిళా విభాగం చీఫ్, జైషే ఫౌండర్ మసూద్ అజార్ సోదరి సాదియా అజార్‌తో షాహీన్‌కు నేరుగా సంబంధాలున్నట్లు గుర్తించారు. చీఫ్ ఆదేశాలతో ఆమె దేశంలో మహిళలకు బ్రెయిన్ వాష్ చేసి ఉగ్రవాదంలోకి దింపుతోంది. షాహీన్ అమాయకంగా, క్రమశిక్షణతో ఉండేదని 2009లో ఆమె పనిచేసిన కన్నౌజ్ మెడికల్ కాలేజీ అధికారులు చెప్పడం గమనార్హం.
News November 12, 2025
ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం మరింత పెంచుతాం: మంత్రి తుమ్మల

TG: ఆయిల్ పామ్ సాగులో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2.74 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతుండగా.. మరో 12 లక్షల ఎకరాలు ఈ పంట సాగుకు అనువుగా ఉందని తెలిపారు. వచ్చే నాలుగేళ్లపాటు ప్రతి ఏడాది కొత్తగా 2 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేస్తూ.. వచ్చే మూడేళ్లలో 10 లక్షల ఎకరాలకు సాగు విస్తీర్ణం పెంచుతామన్నారు.


