News January 13, 2025

కోహ్లీ రెస్టారెంట్‌: ఉడ‌క‌బెట్టిన మొక్క‌జొన్న ధ‌ర ₹525

image

కోహ్లీ రెస్టారెంట్ చైన్ One8 Communeలో ధ‌ర‌లపై చ‌ర్చ నడుస్తోంది. ఉడ‌క‌బెట్టిన ప్లేటు మొక్క‌జొన్న కంకులకు ₹525 ధ‌ర చెల్లించానని HYDకు చెందిన ఓ యువ‌తి పెట్టిన పోస్టు వైర‌ల్ అవుతోంది. దీంతో కొంద‌రు ఆమెకు మ‌ద్ద‌తిస్తుంటే, ఇంకొంద‌రు త‌ప్పుబ‌డుతున్నారు. బ్రాండ్ హోట‌ల్స్‌లో ఉండే ఏంబియ‌న్స్‌కు ఆ మాత్రం ధ‌ర ఉంటుంద‌ని ఒక‌రు, One8 క‌మ్యూనిటీ మొత్తానికీ చెల్లించార‌ని మ‌రొక‌రు కామెంట్ చేస్తున్నారు.

Similar News

News October 27, 2025

ఇళ్ల నుంచి బయటికి రావొద్దు: మంత్రి అనిత

image

AP: మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటికి రావద్దని హోంమంత్రి అనిత సూచించారు. తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో రెస్క్యూ ఆపరేషన్ కోసం హెలిప్యాడ్లు సిద్ధం చేశామన్నారు. బెంగళూరు, చెన్నై, HYD నుంచి నేవీ హెలికాప్టర్లను రప్పిస్తున్నట్లు చెప్పారు. అటు కాకినాడలో తుఫాన్ తీరం దాటనుండటంతో విద్యుత్ స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. ముందస్తుగా 3వేల స్తంభాలు సిద్ధం చేశారు.

News October 27, 2025

తుఫానుగా బలపడ్డ తీవ్ర వాయుగుండం.. అతి భారీ వర్షాలు

image

నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడిందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి చెన్నైకి 640kms, విశాఖకి 740kms, కాకినాడకి 710kms దూరంలో కేంద్రీకృతం అయిందని పేర్కొంది. రేపు ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి, రాత్రికి తీరం దాటొచ్చని అంచనా వేసింది. నేడు కాకినాడ, కోనసీమ, ప.గో, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ-అతిభారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.

News October 27, 2025

ఆ గొడ్డు మంచిదైతే ఆ ఊళ్లోనే అమ్ముడుపోను

image

కొంతమంది సొంతూరిలో తమకు సరైన అవకాశాలు లేవని చెప్పుకుంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. అయితే అతనిలో సత్తా ఉంటే సొంత ప్రాంతంలోనే పని లభించేదని ఈ సామెత అర్థం. అయితే ప్రతిభ అనేది ఒకరు ఆపితే ఆగేది కాదని చెప్పే పెద్దలు ఈ జాతీయాన్ని ఉదహరిస్తూ వేరొక చోట ప్రయత్నాలు చేసేవారిని గురించి విమర్శిస్తూ మాట్లాడేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు.
☛ మీకు తెలిసిన వ్యవసాయ సామెతలను కామెంట్ చేయండి.