News September 7, 2025
భారత-A జట్టులో కోహ్లీ, రోహిత్?

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారత-ఏ జట్టులో ఆడతారని తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరగబోయే అనధికార మూడు వన్డేల సిరీస్‌లో వీరిని ఆడించాలని BCCI నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని టాక్. కాగా కోహ్లీ, రోహిత్ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడాలంటే దేశవాళీ మ్యాచులు ఆడాల్సిందేనని బీసీసీఐ రూల్ పెట్టినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News September 8, 2025
అధికారిక మీటింగ్‌లో సీఎం భర్త.. మండిపడ్డ ఆప్

ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఆమ్ ఆద్మీ పార్టీ ఫైర్ అయింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆమె భర్త మనీశ్ గుప్తా పాల్గొనడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇది ‘పంచాయత్’ వెబ్ సిరీస్‌ను తలపిస్తోందని విమర్శించింది. అధికారిక మీటింగ్‌లో సీఎం పక్క ఛైర్‌లో ఆమె భర్త కూర్చున్న ఫొటోను Xలో షేర్ చేసింది. ఈ చర్య ముమ్మాటికీ రాజ్యాంగ విరుద్ధమని మండిపడింది.
News September 8, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోన్న బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110 తగ్గి రూ.1,08,380కు చేరింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.100 పతనమై రూ.99,350 పలుకుతోంది. అటు KG వెండిపై రూ.1000 తగ్గి రూ.1,37,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News September 8, 2025
విశాఖలో మూగ బాలికపై అత్యాచారం!

AP: విశాఖలో అమానుష ఘటన వెలుగు చూసింది. ఓ మూగ బాలికపై ఇద్దరు కీచకులు అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసి తమ కుమార్తెపై అత్యాచారం జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై CP శంఖబ్రత బాగ్చీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. వెంటనే పూర్తి వివరాలు సేకరించాలని సిబ్బందిని ఆదేశించారు. మద్యం మత్తులో యువకులు ఈ దారుణానికి పాల్పడినట్లు సమాచారం.