News August 23, 2025
కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ ఇప్పుడే కాదు: రాజీవ్ శుక్లా

వన్డేల నుంచి టీమ్‌ఇండియా స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోరని BCCI ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. వారిద్దరి రిటైర్మెంట్‌కు అంత తొందర ఏంటని ప్రశ్నించారు. ‘ప్రస్తుతం కోహ్లీ ఎంతో ఫిట్‌గా ఉన్నారు. అలాగే రోహిత్ కూడా బాగా రాణిస్తున్నారు. అలాంటప్పుడు వారు రిటైర్మెంట్ కావాల్సిన అవసరం లేదు. దీనిపై కొందరు లేనిపోని వ్యాఖ్యలు చేయడం దారుణం’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News August 23, 2025
అనిల్ అంబానీ నివాసాల్లో సీబీఐ సోదాలు

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ముంబైలోని నివాసాలు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు నిర్వహిస్తోంది. బ్యాంకులకు రూ.వేల కోట్ల రుణం ఎగ్గొట్టారనే ఆరోపణలతో ఆర్.కామ్, అంబానీతో సంబంధం ఉన్న చోట్ల సోదాలు చేస్తోంది. ఇటీవల ఈడీ కూడా ఆయన కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి, ఆ తర్వాత విచారించిన సంగతి తెలిసిందే.
News August 23, 2025
సాఫ్ట్ డ్రింక్స్ బ్యాన్ చేస్తాం.. USకు LPU ఫౌండర్ వార్నింగ్

ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) ఫౌండర్ అశోక్ కుమార్ మిట్టల్ అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. భారత్‌పై 50% టారిఫ్స్‌ను ఆగస్టు 27లోగా వెనక్కి తీసుకోకపోతే చండీగఢ్‌లోని తమ క్యాంపస్‌లో అమెరికా సాఫ్ట్ డ్రింక్స్, బేవరేజ్ కంపెనీలను బ్యాన్ చేస్తామని హెచ్చరించారు. తమ యూనివర్సిటీలో 40వేల మంది విద్యార్థులు ఉన్నారని, దేశంలోని అతిపెద్ద వర్సిటీల్లో ఒకటని పేర్కొన్నారు.
News August 23, 2025
ధర్మస్థల.. మాస్క్ మ్యాన్ ఇతడే!

కర్ణాటకలోని ధర్మస్థలలో హత్యాచారానికి గురైన వందలాది మహిళల మృతదేహాలను ఖననం చేసినట్లు చెబుతున్న మాజీ శానిటరీ వర్కర్ ఫొటో తొలిసారి బయటకు వచ్చింది. అతడు అబద్ధాలు చెప్పి తప్పుదోవ పట్టించినట్లు గుర్తించిన సిట్ అధికారులు.. ఇవాళ <<17491461>>అరెస్టు<<>> చేశారు. అతడి పేరు CN చిన్నయ్య అలియాస్ చెన్నా అని పోలీసులు తెలిపారు. ధర్మస్థల వివరాలు చెప్పినందుకు తనను చంపుతారనే భయంతో మాస్క్ ధరించినట్లు ఇది వరకు అతడు చెప్పాడు.