News July 1, 2024
కోహ్లీని బౌలర్లే కాపాడారు: సంజయ్ మంజ్రేకర్

టీ20 WC ఫైనల్లో POTM అవార్డు కోహ్లీకి బదులుగా బౌలర్లకు ఇవ్వాల్సిందని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. భారత్ ఇన్నింగ్స్లో సగం ఓవర్లు ఆడిన విరాట్ 128SRతో మాత్రమే బ్యాటింగ్ చేశారని, దీని వల్ల హార్దిక్ లాంటి హిట్టర్కు 2 బాల్స్ మాత్రమే ఆడే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. మ్యాచ్ ఓడిపోతే కోహ్లీపై విమర్శలు వచ్చేవని, కానీ బౌలర్లు అద్భుతంగా రాణించి అతడిని కాపాడారని చెప్పుకొచ్చారు.
Similar News
News November 22, 2025
రోడ్డు ప్రమాదంలో సింగర్ మృతి

ఘోర రోడ్డు ప్రమాదంలో పంజాబీ సింగర్ హర్మన్ సిద్ధూ(37) మృతి చెందారు. మాన్సా-పాటియాలా రోడ్డులో వెళ్తుండగా ఆయన కారు ట్రక్కును ఢీకొట్టింది. దీంతో హర్మన్ అక్కడికిక్కడే మరణించారు. బేబే బాపు, బబ్బర్ షేర్, కోయ్ చక్కర్ నై, ముల్తాన్ వర్సెస్ రష్యా తదితర సాంగ్స్తో ఆయన పాపులర్ అయ్యారు. హర్మన్ మృతితో అభిమానులు విషాదంలో మునిగిపోయారు.
News November 22, 2025
కార్ల వేలానికి ఓకే.. నీరవ్ మోదీకి సీబీఐ కోర్టు షాక్

బ్యాంకులను మోసం చేసి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి సీబీఐ కోర్టు షాకిచ్చింది. ఆయనకు సంబంధించి ఈడీ సీజ్ చేసిన 2 కార్లను వేలం వేయడానికి స్పెషల్ జడ్జి జస్టిస్ ఏవీ గుజ్రాతీ అనుమతించారు. బెంజ్ GLE250 (39 లక్షలు), స్కోడా సూపర్బ్ ఎలిగెన్స్ (7.5 లక్షలు) కార్లు వేలం వేసి డబ్బును నేషనలైజ్డ్ బ్యాంక్లో డిపాజిట్ చేయాలన్నారు. సీజ్ చేసిన 3 కార్ల వేలానికి అనుమతి కోరగా రెండింటికే అంగీకరించింది.
News November 22, 2025
మహిళలు గంధం రాసుకునేది ఎందుకంటే?

ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నప్పుడు చుట్టాలతో, పెద్దవారితో ఆప్యాయంగా, వినయంగా మాట్లాడాల్సిన బాధ్యత ఇల్లాలుపై ఉంటుంది. అయితే కొందరు మహిళల మాటతీరు గట్టిగా ఉంటుంది. శుభకార్యాలప్పుడు అతిథులు ఈ మాటతీరును ఇబ్బందిగా భావిస్తారు. అందుకే గొంతుపై గంధం రాస్తారు. ఇలా రాస్తే గొంతు సరళంగా, సున్నితంగా మారి మాటతీరు తియ్యగా, వినస్రవ్యంగా మారుతుందని నమ్మేవారు. స్త్రీ రూపానికి తగిన మృదువైన స్వరం ఉండాలని ఇలా చేశారు.


