News January 18, 2025
కోహ్లీ ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడాలి: మంజ్రేకర్

ENGలో జరిగే కౌంటీ ఛాంపియన్ షిప్లో విరాట్ కోహ్లీ ఆడాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించారు. ‘కోహ్లీకి రెడ్ బాల్ ప్రాక్టీస్ చాలా అవసరం. జూన్‌లో ENGతో టెస్టు సిరీస్ ఉంది కాబట్టి ఏప్రిల్ నుంచి జరిగే కౌంటీల్లో అతడు ఆడాలి. పుజారాలా కౌంటీల్లో ఆడితే ప్రాక్టీస్ లభిస్తుంది. ఇంగ్లండ్‌తో టెస్టుల్లో కోహ్లీ ఆటను సెలక్టర్లు గమనిస్తారు. అతడు సరిగా ఆడకపోతే అది జట్టుకు పెద్ద సమస్యగా మారుతుంది’ అని అన్నారు.
Similar News
News December 8, 2025
అరకు: ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

అరకులోయ మండలం ఇరగాయి పంచాయతీ పరిధి ఉరుములులో ఎలుగుబంటి దాడిలో గిరిజనుడికి తీవ్ర గాయాలైన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. అప్పారావు గ్రామ సమీపంలోని కాఫీ తోటకి కాపలగా వెళ్లాడు. ఆదివారం అర్ధరాత్రి ఓ ఎలుగుబంటి అతనిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. క్షతగాత్రుడిని 108లో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఎలుగుబంట్లు పొలాల్లోకి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
News December 8, 2025
మైసూరు పప్పు మాంసాహారమా?

పూజలు, వ్రతాల సమయంలో మైసూరు పప్పు తినకూడదంటారు. దీన్ని మాంసాహారంగా కూడా కొందరు భావిస్తారు. ఇందులో బద్ధకాన్ని కలిగించే తామస గుణాలుండటం అందుకు తొలి కారణం. అలాగే ఓ రాక్షసుడి రక్తం బొట్టు నుంచి ఈ పప్పు పుట్టిందని కొందరు పండితులు పేర్కొంటారు. పాల సముద్రాన్ని చిలకగా వచ్చిన అమృతాన్ని దొంగచాటుగా తాగిన సర్భాను తలను విష్ణు సుదర్శన చక్రంతో ఖండించాడట. ఆ రక్తపు చుక్కలు పడిన చోట ఇవి మొలిచాయని నమ్ముతారు.
News December 8, 2025
ఫైబ్రాయిడ్స్ లక్షణాలివే..

ఫైబ్రాయిడ్స్ ఉన్న మహిళల్లో నెలసరి స్రావంలో రక్తపు గడ్డలు కనిపించడం, నొప్పి ఉంటాయి. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ చాలా పెద్దవిగా ఉంటే మూత్రాశయం మీద ఒత్తిడి పడి తరచూ మూత్రవిసర్జన చేయవలసి రావడం, మూత్రవిసర్జన పూర్తిగా జరగకపోవడం, జీర్ణ సమస్యలు వంటివి మొదలవుతాయి. కొన్ని రకాల ఫైబ్రాయిడ్లు గర్భసంచి లోపలి పొరల్లో ఏర్పడతాయి. వీటి వల్ల గర్భస్రావం జరిగిపోవడం, గర్భం దాల్చలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి.


