News March 21, 2025
కష్ట సమయాల్లో అండగా కోహ్లీ: సిరాజ్

ఆర్సీబీని వీడటం బాధగా ఉందని పేస్ బౌలర్ సిరాజ్ అన్నారు. తన కెరీర్లో విరాట్ కోహ్లీ ప్రధాన పాత్ర పోషించారని చెప్పారు. 2018-19లో క్లిష్ట పరిస్థితుల్లోనూ తన వెన్నంటి ఉన్నారన్నారు. ఆ తర్వాత తాను తిరిగి సత్తా చాటినట్లు తెలిపారు. గత ఏడాది వేలంలో సిరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ సొంతం చేసుకుంది. ఆర్సీబీ తరఫున 87 మ్యాచుల్లో 83 వికెట్లు తీశారు. ఆర్సీబీ తరఫున అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ సిరాజ్.
Similar News
News November 6, 2025
పెరిగిన ఓటింగ్ శాతం.. ఎవరికి సానుకూలం?

బిహార్‌లో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఓటింగ్ పర్సంటేజ్ 57.29శాతం కాగా ఇవాళ జరిగిన ఫస్ట్ ఫేజ్‌లో సా.5 గంటల వరకే 60.13శాతం పోలింగ్ నమోదైంది. సా.6 గంటల వరకు లెక్కేస్తే ఇది మరింత పెరగనుంది. దీంతో పర్సంటేజ్ పెరగడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తమకే సానుకూలమంటూ JDU-BJP నేతృత్వంలోని NDA, RJD-INC నేతృత్వంలోని మహా గఠ్ బంధన్ కూటములు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
News November 6, 2025
సినిమా అప్డేట్స్

* సందీప్‌రెడ్డి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కనున్న ‘స్పిరిట్’ చిత్రంలో దగ్గుబాటి అభిరామ్ కీలక పాత్ర పోషిస్తారని సమాచారం.
* అమన్ కౌశిక్ డైరెక్షన్లో విక్కీ కౌశల్ హీరోగా ‘మహావతార్’ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. పరశురాముని పాత్రలో నటిస్తోన్న విక్కీ.. నాన్ వెజ్ మానేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్.
* కల్కి-2లో హీరోయిన్ పాత్ర కోసం ఆలియా, సాయిపల్లవి, అనుష్క, కల్యాణి ప్రియదర్శన్ పేర్లు తెరపైకి వచ్చాయి.
News November 6, 2025
బయోమాస్‌తో రైతులకు ఆదాయం, ఉపాధి: సారస్వత్

AP: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి బయోమాస్ ఎంతో ఉపయుక్తమని AP గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ అడ్వయిజరీ బోర్డు ఛైర్మన్ సారస్వత్ పేర్కొన్నారు. బయోమాస్‌లో ఏపీ నం.1గా ఉందన్నారు. రైతులకు ఆదాయంతో పాటు ఉపాధి మెరుగుపడుతుందని బోర్డు భేటీలో చెప్పారు. విశాఖ(D) పూడిమడక వద్ద ₹1.85 L కోట్లతో NGEL హైడ్రోజన్ హబ్‌ను నెలకొల్పుతోందని CS విజయానంద్ తెలిపారు. రోజుకు 1,500 టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేస్తారని చెప్పారు.


