News January 6, 2025

కోహ్లీ వద్ద ఇంకా చాలా రన్స్ ఉన్నాయి: పాంటింగ్

image

సిడ్నీ టెస్టు 2వ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లీ ఔట్ అవగానే అసహనానికి గురైన విషయం తెలిసిందే. దీనిపై ఆసీస్ మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. ఒకే తరహాలో పదే పదే పెవిలియన్‌కు చేరుతుండటంపై కోహ్లీ తనపై తానే కోపం చూపించుకున్నాడని చెప్పారు. విరాట్‌కు ఈ సిరీస్ కచ్చితంగా నిరాశ కలిగించిందన్నారు. కానీ అతని వద్ద ఇంకా చాలా పరుగులు ఉన్నాయని ఆయన చెప్పారు. BGTలో కోహ్లీ 190పరుగులే చేశారు.

Similar News

News December 6, 2025

విశాఖ నుంచి వెళ్లవలసిన పలు విమానాలు రద్దు

image

విశాఖ నుండి వెళ్ళవలసిన పలు విమానాలు రద్దు అయినట్టు శనివారం ఉదయం ఇంచార్జి ఏర్పోర్ట్ డైరెక్టర్ ఎన్.పురుషోత్తం తెలిపారు. వాటిలో ఇండిగో సంస్థకు చెందిన 6E 217 / 6E 218 BLR – VTZ – BLR, 6E 5248 / 6E 845 BOM – VTZ – MAA, 6E 557 / 6E 6585 MAA – VTZ – BOM ఆపరేషన్ రీజనల్ కారణంగా రద్దయినట్లు తెలిపారు. వీటితో పాటు మరో 9 విమానాలను రద్దు చేశారు.

News December 6, 2025

NCCDలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

నేషనల్ సెంటర్ ఫర్ కోల్డ్‌చైన్ డెవలప్‌మెంట్‌లో 5 పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు contact-nccd@gov.in ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. పోస్టును బట్టి బీఈ, బీటెక్, పీజీ(అగ్రి బిజినెస్), ఎంకామ్, సీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: nccd.gov.in.

News December 6, 2025

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.540 తగ్గి రూ.1,30,150కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.500 పతనమై రూ.1,19,300పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.1,95,900గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.