News May 20, 2024
కోహ్లీ.. ఈసారి నువ్వు కప్పు కొట్టాలి: ధోనీ!

RCBతో మ్యాచ్ ఓటమి అనంతరం తీవ్ర నిరాశకు గురైన CSK లెజండరీ క్రికెటర్ ధోనీ.. షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండానే మైదానం వీడిన సంగతి తెలిసిందే. అయితే.. ధోనీని కలిసేందుకు కోహ్లీ అతడి డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లారు. కాగా.. ‘ఈసారి నువ్వు ఫైనల్కు వెళ్లాలి. టైటిల్ కొట్టాలి. గుడ్ లక్’ అని విష్ చేశారట. దీంతో క్రికెట్లో మహిరాట్(మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ ఫ్రెండ్షిప్)ను మించిన ఎమోషన్ మరొకటి లేదని ఫ్యాన్స్ అంటున్నారు.
Similar News
News November 24, 2025
PGIMERలో 151 పోస్టులు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

చండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (PGIMER)లో 151 సీనియర్ రెసిడెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, MS, MA/MSc, PhD ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.1500, SC, STలకు రూ.800, PwBDలకు ఫీజు లేదు. డిసెంబర్ 6న పరీక్ష నిర్వహిస్తారు. https://pgimer.edu.in
News November 24, 2025
సినిమా అప్డేట్స్

* రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా DEC 12న జైలర్-2 టీజర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
* ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి’ సాంగ్కు ఇన్స్టా, యూట్యూబ్లో 500K+ రీక్రియేషన్స్ వచ్చినట్లు మేకర్స్ తెలిపారు.
* గోపీచంద్ మలినేని-బాలకృష్ణ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాక్.
* ప్రశాంత్ నీల్-జూ.ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాలో ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ వేస్తున్నట్లు సమాచారం.
News November 24, 2025
చెరకు నరికిన తర్వాత ఆలస్యం చేస్తే..

చెరకు నరికిన తర్వాత రోజులు, గంటలు గడుస్తున్నకొద్దీ గడలలోని సుక్రోజ్ శాతం తగ్గుతుంది. ఈ గడలను గానుగాడించకుండా ఉంచితే.. నిల్వ కాలం పెరిగేకొద్దీ బరువు తగ్గుతుంది. చెరకు నరికిన తర్వాత 24 గంటలు ఆలస్యమైతే 1.5%, 48 గంటలు ఆలస్యమైతే 3%, 72 గంటలు ఆలస్యమైతే 5% వరకు దిగుబడిలో నష్టం జరుగుతుంది. అదే విధంగా రసనాణ్యతలోనూ 0.4%-0.6% వరకు క్షీణత కనిపిస్తుంది. నరికిన చెరకును నీడలో ఉంచితే ఈ నష్టం కొంత తగ్గుతుంది.


