News January 30, 2025
నేడు రంజీ మ్యాచ్ ఆడనున్న కోహ్లీ

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇవాళ రంజీ మ్యాచ్ ఆడనున్నారు. డిల్లీలో రైల్వేస్‌తో జరగబోయే మ్యాచులో ఆయన బరిలోకి దిగుతారు. కాగా కోహ్లీ దాదాపు 13 ఏళ్ల తర్వాత దేశవాళీ మ్యాచ్ ఆడబోతున్నారు. ఈ మ్యాచ్‌లో విరాట్ నాలుగో స్థానంలో బరిలోకి దిగుతారు. ఈ మ్యాచ్‌ను ‘Jio Cinema’ టెలికాస్ట్ చేయనుంది. కాగా కోహ్లీ ఓవరాల్‌గా 23 రంజీ మ్యాచులు ఆడి 1,547 పరుగులు చేశారు. ఇందులో 5 శతకాలు ఉన్నాయి.
Similar News
News September 19, 2025
బొప్పాయిలో రింగ్ స్పాట్ వైరస్ కట్టడికి చర్యలు

రింగ్ స్పాట్ వైరస్ సోకిన బొప్పాయి మొక్కల్లో దిగుబడి, కాయ నాణ్యత పెంచడానికి లీటరు నీటికి 10 గ్రాముల యూరియా, 1.5 గ్రాములు జింక్ సల్ఫేట్ & ఒక గ్రాము బోరాన్ కలిపి 30 రోజుల వ్యవధిలో 8 నెలల వరకు పిచికారీ చేయాలి. అలాగే వంగ, గుమ్మడి జాతి పంటలను బొప్పాయి చుట్టుపక్కల పెంచకూడదు. బొప్పాయి మొక్కలు నాటే 15 రోజుల ముందు అవిశ రెండు వరుసలు, మొక్కజొన్న, జొన్న మొక్కలను రెండు వరుసల్లో రక్షణ పంటలుగా వేసుకోవాలి.
News September 19, 2025
పోలీస్ శాఖలో 12,542 ఖాళీలు!

TG: పోలీస్ శాఖలో వివిధ కేటగిరీల్లో 12,542 ఖాళీ పోస్టులున్నాయి. ఈ మేరకు పోలీస్ శాఖ తాజాగా ఆర్థికశాఖకు వివరాలు సమర్పించింది. అత్యధికంగా సివిల్ కానిస్టేబుల్ కేటగిరీలో 8,442, ఏఆర్ కానిస్టేబుల్ 3,271, SI సివిల్ కేటగిరీలో 677, ఏఆర్‌లో 40, టీజీఎస్పీ కేటగిరీలో 22 పోస్టులున్నట్లు పేర్కొంది. వీటిని జాబ్ క్యాలెండర్‌లో పొందుపర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.
News September 19, 2025
‘చలో మెడికల్ కాలేజీ’.. వైసీపీ ఆందోళనలు

AP: మెడికల్ కాలేజీల PPP విధానంపై వైసీపీ ‘చలో మెడికల్ కాలేజీ’ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తోంది. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు కొందరు ముఖ్య నేతలను హౌస్ అరెస్టు చేశారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం అని నేతలు విమర్శించారు. ప్రైవేటీకరణను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు #SaveMedicalCollegesInAP అంటూ వైసీపీ ట్వీట్లు చేస్తోంది.