News July 14, 2024
లండన్‌లో స్థిరపడనున్న కోహ్లీ?

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్‌లో స్థిరపడాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ సమయం ఆయన అక్కడే గడుపుతుండటంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. విరాట్ కొడుకు అకాయ్‌ను ఇంతవరకూ భారత్‌కు తీసుకురాలేదు. ప్రస్తుతం కోహ్లీ, అనుష్కకు లండన్‌లో ఓ కంపెనీ ఉంది. దీంతో ఆ దేశం వారికి సిటిజన్‌షిప్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రికెట్‌కు గుడ్ బై చెప్పాక కోహ్లీ లండన్‌లో సెటిల్ కానున్నట్లు టాక్.
Similar News
News November 29, 2025
క్వాలిటీ టెస్టులో పతంజలి ఆవు నెయ్యి ఫెయిల్.. రూ.లక్ష జరిమానా

ఉత్తరాఖండ్ పిథోర్‌గఢ్‌లోని బాబా రాందేవ్‌కు చెందిన పతంజలి కంపెనీకి ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిమానా విధించారు. ఆ సంస్థ ఉత్పత్తి చేసిన ఆవు నెయ్యి క్వాలిటీ టెస్టులో ఫెయిలైంది. ఆ నెయ్యి వినియోగానికి పనికిరాదని నిర్ధారించిన అధికారులు రూ.లక్ష ఫైన్ వేశారు. దాంతో సైడ్ ఎఫెక్ట్స్‌తో పాటు అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు.
News November 29, 2025
సిరిసిల్ల: సారూ.. ఇసుక ట్రాక్టర్ల దారి మళ్లించండి

ఇసుక ట్రాక్టర్ల దారి మార్చాలంటూ ఆదర్శనగర్, సాయినగర్ కాలనీ వాసులు ట్రాక్టర్లకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. తమ ఇండ్ల మధ్య నుంచి నిత్యం ఇసుక ట్రాక్టర్లు అతివేగంగా వెళ్తున్నాయని, పిల్లలకు ప్రమాదకరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. రవాణాతో దుమ్ము అధికంగా రావడం వల్ల శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పారు. సీఐ, ఎస్సై అక్కడికి చేరుకుని రెవెన్యూ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామన్నారు.
News November 29, 2025
ఈ ఫైనాన్స్ జాబ్స్‌తో నెలకు రూ.లక్షపైనే జీతం

భారతదేశ ఫైనాన్స్ సెక్టార్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నుంచి ఫిన్‌టెక్, రిస్క్ మేనేజ్మెంట్ వంటి విభాగాల్లో ఎంట్రీలెవల్లోనే నెలకు రూ.లక్షపైనే జీతం ఆఫర్ చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో అత్యధికంగా M&A అనలిస్ట్‌కు ఏడాదికి రూ.30 లక్షల వరకు, ఫిన్‌టెక్ ఫైనాన్షియల్ అనలిస్టుకు ఏడాదికి రూ.20 లక్షల వరకు, రిస్క్ మేనేజ్మెంట్లో క్వాంట్ రిస్క్ అనలిస్టుకు ఏడాదికి రూ.25 లక్షల వరకు ఆఫర్ చేస్తున్నారు.


