News February 11, 2025

రోహిత్‌లాగే కోహ్లీ ఫామ్‌లోకి వస్తారు: మురళీధరన్

image

రోహిత్ శర్మలానే విరాట్ కోహ్లీ కూడా ఫామ్ అందుకుంటారని శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ అభిప్రాయపడ్డారు. వీరిద్దరూ ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగితే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు. ‘ప్రస్తుతం రోహిత్ సేన అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉంది. భారత్‌తోపాటు పాక్, బంగ్లా, అఫ్గాన్‌లో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. వీరికి పాకిస్థాన్ పిచ్‌లు బాగా సహకరిస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 11, 2025

పదో తరగతి అర్హతతో 21,413 ఉద్యోగాలు

image

ఇండియన్ పోస్ట్ 21,413 GDS పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏపీలో 1215, తెలంగాణలో 519 ఖాళీలున్నాయి. అర్హత 10వ తరగతి కాగా కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి. సైకిల్ లేదా స్కూటర్ నడిపే నైపుణ్యం ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. మెరిట్ ఆధారంగా రిక్రూట్‌మెంట్ చేపడతారు. దరఖాస్తు ఫీజు జనరల్, ఓబీసీ, EWS వారికి రూ.100 కాగా మిగతా అభ్యర్థులకు ఉచితం. మార్చి 3 వరకు <>ఆన్‌లైన్‌లో<<>> దరఖాస్తు చేసుకోవచ్చు.

News February 11, 2025

పేరెంట్స్ శృంగారంపై కామెంట్స్.. వీడియో తొలగించిన యూట్యూబ్

image

‘ఇండియాస్ గాట్ లేటెంట్‌’లో పేరెంట్స్ శృంగారంపై యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియ చేసిన <<15413969>>అభ్యంతకర వ్యాఖ్యలు<<>> దుమారం రేపుతున్నాయి. పార్లమెంటులోనూ ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలో మొత్తం ఎపిసోడ్‌ వీడియోను యూట్యూబ్ తొలగించింది. సమాచార మంత్రిత్వ శాఖ, NHRC ప్రతినిధుల ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. తన వ్యాఖ్యలపై రణ్‌వీర్ క్షమాపణ కోరిన విషయం తెలిసిందే.

News February 11, 2025

ఆ సీసీ కెమెరాలు అధికారులే తొలగించారు: YCP

image

AP: తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద అగ్నిప్రమాద ఘటనపై CC ఫుటేజీ ఇవ్వాలన్న పోలీసుల <<15407091>>నోటీసులకు<<>> పార్టీ ప్రతినిధులు సమాధానం ఇచ్చారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆ రోడ్డులోని సీసీ కెమెరాలను అధికారులే తొలగించారని తెలిపారు. బారికేడ్లను తీసేసి అన్ని వాహనాలకు అనుమతిచ్చారన్నారు. మాజీ సీఎం జగన్ భద్రతపై అనుమానాలున్నాయని, ఈ విషయాన్ని ఇప్పటికే కోర్టు దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.

error: Content is protected !!