News December 21, 2024
కోహ్లీ అలా చేస్తే ఫామ్ అందుకుంటారు: బంగర్

ఫామ్ అందుకోవాలంటే విరాట్ కోహ్లీ క్రీజులో ఎక్కువ సేపు ఉండాలని భారత మాజీ కోచ్ సంజయ్ బంగర్ సూచించారు. ‘బంతిని వేటాడకుండా దాన్ని తన వద్దకు రానివ్వాలి. క్రీజులో నిలదొక్కుకుంటే ఇక ఆ తర్వాత బ్యాటింగ్ చాలా సులువవుతుంది. విరాట్ త్వరపడుతున్నారు. తర్వాతి టెస్టులో ఆయన వీలైనన్ని ఎక్కువ బంతులు ఆడాలి. టైమ్ తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. గడచిన 5 ఇన్నింగ్స్లలో విరాట్ 126 పరుగులు మాత్రమే చేశారు.
Similar News
News December 23, 2025
భారత్ టార్గెట్ ఎంతంటే?

AP: శ్రీలంక ఉమెన్స్ జట్టును టీమ్ ఇండియా మరోసారి కట్టడి చేసింది. విశాఖలో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక ప్లేయర్లు 20 ఓవర్లలో 128/9 మాత్రమే స్కోర్ చేశారు. హర్షిత(33), కెప్టెన్ చమరి ఆటపట్టు(31), హాసినీ పెరేరా(22) మినహా ఎవరూ పెద్దగా రాణించలేదు. భారత బౌలర్లలో శ్రీచరణి, వైష్ణవి శర్మ చెరో 2 వికెట్లు, క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా చెరో వికెట్ తీశారు. గెలుపు కోసం టీమ్ ఇండియా 20 ఓవర్లలో 129 రన్స్ చేయాలి.
News December 23, 2025
ఇంటి ముఖ ద్వారం ఏ దిశలో ఉండాలి?

ఇంటికి ఏ దిశలోనైనా ముఖద్వారం ఉండవచ్చని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. అయితే గాలి, వెలుతురు ప్రసరణ సరిగ్గా ఉండటం ముఖ్యమని అంటున్నారు. ‘ప్రధాన ద్వారాలు తూర్పు, పడమర దిశలలో ఉంటే, వాటికి లంబంగా ఉండే ఉత్తర, దక్షిణ గోడలకు కిటికీలు ఏర్పాటు చేసుకోవాలి. ఫలితంగా గాలి ప్రవహించడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఇంట్లోని అశుద్ధ గాలి బయటకు వెళ్లి, తాజా గాలి లోపలికి వస్తుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 23, 2025
ప్రతి 3.25 సెకన్లకు ఒక బిర్యానీ ఆర్డర్

స్విగ్గీలో ఈ ఏడాది మోస్ట్ ఆర్డర్డ్ ఐటమ్గా బిర్యానీ నిలిచింది. వరుసగా 10th ఇయర్ టాప్ ప్లేస్ దక్కించుకుంది. భోజన ప్రియులు ఈ ఏడాది 93 మిలియన్ బిర్యానీలు స్విగ్గీలో ఆర్డర్ పెట్టారు. ప్రతి 3.25 సెకన్లకు ఒక బిర్యానీ ఆర్డర్ వచ్చినట్లు స్విగ్గీ తన ఇయర్ ఎండ్ రిపోర్టులో పేర్కొంది. కాగా మోస్ట్ ఆర్డర్డ్ లిస్టులో బర్గర్స్ (44.2M), పిజ్జా (40.1M), వెజ్ దోశ (26.2M) వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి.


