News June 28, 2024

KOHLI: తుది పోరులోనైనా మెరుస్తారా?

image

టీ20 WCలో టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఘోర వైఫల్యం చెందుతున్నారు. టోర్నీలో ఇప్పటివరకు ఆయన 75 పరుగులు మాత్రమే చేశారు. కానీ కోహ్లీ ఫామ్‌పై తమకు ఎలాంటి ఆందోళన లేదని కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ ప్రకటించారు. ఫైనల్‌లో ఆయన నుంచి పెద్ద ఇన్నింగ్స్ ఆశిస్తున్నట్లు తెలిపారు. పొట్టి కప్పు సమరంలో విరాట్ 1, 4, 0, 24, 37, 0, 9 రన్స్ మాత్రమే చేశారు. దీంతో ఆయన ఫామ్‌పై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Similar News

News September 15, 2025

ఈ జపనీస్ టెక్నిక్​తో హెల్తీ స్కిన్

image

జపనీయులు చర్మం ఆరోగ్యంగా ఉండేందుకు 4-2-4 టెక్నిక్ యూజ్ చేస్తారు. ముందుగా ఆయిల్​ బేస్డ్ క్లెన్సర్​తో ముఖాన్ని 4నిమిషాలు మసాజ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ బేస్డ్ క్లెన్సర్​తో 2నిమిషాలు సున్నితంగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. చివర్లో 2 నిమిషాలు వేడినీటితో, మరో 2 నిమిషాలు చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ఈ పద్ధతి వల్ల చర్మానికి డీప్ క్లెన్సింగ్ అవుతుంది. రక్తప్రసరణ పెరిగి చర్మం బిగుతుగా మారుతుంది.

News September 15, 2025

పీసీఓఎస్‌తో తగ్గుతున్న ప్రతిస్పందన వేగం

image

ప్రస్తుతం చాలామంది మహిళలు PCOSతో బాధపడుతున్నారు. వీరిలో షుగర్, ఊబకాయం, గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువ. అయితే PCOS బాధితుల్లో ప్రతిస్పందన వేగం తగ్గుతున్నట్లు IITబాంబే నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ విషయం బయటపడింది. ఏకాగ్రత తగ్గడం, నెమ్మదిగా స్పందించడం PCOS బాధితుల్లో గుర్తించినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇన్సులిన్‌ హెచ్చుతగ్గులతో మెదడు కణజాలం ప్రభావితమై కాగ్నిటివ్ హెల్త్ దెబ్బతింటున్నట్లు తెలిపారు.

News September 15, 2025

30L తల్లి పాలను దానం చేసిన గుత్తా జ్వాల

image

భారత మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల మంచి మనసు చాటుకున్నారు. తల్లి పాలకు దూరమైన శిశువులు అనారోగ్యం బారిన పడకుండా ఆమె తన పాలను దానం చేశారు. ఏప్రిల్‌లో బిడ్డను కన్న జ్వాల ఇప్పటివరకు దాదాపుగా 30L పాలను మిల్క్ బ్యాంక్‌కు అందించారు. ఈ విషయాన్ని ఆమె SM వేదికగా పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్లు జ్వాల విశాల హృదయానికి ఫిదా అవుతున్నారు. ఆమె అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారంటూ ప్రశంసిస్తున్నారు.