News January 13, 2025
నచ్చకపోతే కోహ్లీ అవకాశాలు ఇవ్వడు: ఉతప్ప

జట్టులో ఎవరైనా నచ్చకపోతే విరాట్ కోహ్లీ అవకాశాలు ఇచ్చేవాడు కాదని, వాళ్లను పూర్తిగా పక్కన పెట్టేస్తాడని ఉతప్ప ఆరోపించారు. అందుకే 2019 ప్రపంచ కప్‌కి అంబటి రాయుడు ఎంపిక కాలేదని, కోహ్లీకి అతనంటే ఇష్టం లేదని పేర్కొన్నారు. రాయుడికి వరల్డ్ కప్ జెర్సీ, కిట్‌బ్యాగ్ పంపిన తరువాత కూడా జట్టులోకి తీసుకోలేదన్నారు. ఒకర్ని ఇంటికి పిలిచి మొహం మీద తలుపులు వేయడం తగదని ఉతప్ప వ్యాఖ్యానించారు.
Similar News
News December 10, 2025
ఇండిగో ఎఫెక్ట్.. ఢిల్లీ ఎకానమీకి రూ.1000 కోట్ల నష్టం

ఇండిగో సంక్షోభంతో ఢిల్లీలోని పలు వ్యాపార రంగాలు రూ.1000 కోట్లు నష్టపోయాయని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ తెలిపింది. ట్రేడర్స్, టూరిస్ట్స్, బిజినెస్ ట్రావెలర్స్ తగ్గారని CTI ఛైర్మన్ బ్రిజేశ్ గోయల్ చెప్పారు. వారం రోజుల్లో ఢిల్లీలోని హోటల్స్, రెస్టారెంట్స్, రిసార్టుల్లో చాలా బుకింగ్స్ రద్దయ్యాయన్నారు. ఆటో మొబైల్స్, హోమ్ నీడ్స్, చేనేత వస్త్రాల ప్రదర్శనలకు సందర్శకులు కరవయ్యారని తెలిపారు.
News December 10, 2025
డ్రై స్కిన్ కోసం ఈ ఫేస్ ప్యాక్

డ్రై స్కిన్ ఉన్న వాళ్లకి చర్మంలో తేమ తగ్గి ముడతలు త్వరగా వచ్చేస్తాయి. ఇలా కాకుండా ఉండాలంటే టేబుల్‌స్పూన్ కీరదోస గుజ్జులో, టీస్పూన్ ఆలివ్ నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకొని ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆపై సాధారణ నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల కీరదోసలోని నీరు ముఖ చర్మంలోకి ఇంకిపోయి పొడిదనం క్రమంగా తగ్గుతుంది. చర్మం నవయవ్వనంగా కనిపిస్తుంది.
News December 10, 2025
తలరాతను మార్చే క్రమంలో చిగురించిన ప్రేమ..!

బిహార్‌లో సినిమా కథను తలపించే ఘటన జరిగింది. రైళ్లలో యాచిస్తున్న అనాథ బాలికను చూసి ఒక యువకుడు చలించిపోయాడు. ఆమె తలరాతను మార్చాలని నిర్ణయించుకున్నాడు. ఎంతో శ్రమించి ఆమె కుటుంబ మూలాలను కనుగొని విడిపోయిన వారికి దగ్గర చేశాడు. మానవత్వంతో మొదలైన ఈ ప్రయాణంలో వారి మధ్య పెరిగిన విశ్వాసం ప్రేమగా మారింది. రైల్వే ప్లాట్‌ఫారమ్ నుంచి మొదలైన వారి ప్రయాణం తాజాగా వివాహ బంధంగా మారి ముందుకు సాగుతోంది.


