News February 24, 2025

కోహ్లీ సెంచరీ.. అనుష్క శర్మ ❤️ పోస్ట్ వైరల్

image

పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ చేసి జట్టును గెలిపించడమే కాకుండా తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ను టీవీలో చూసిన అనుష్క శర్మ భర్త కోహ్లీని ఫొటో తీసి హైఫై, లవ్ సింబల్‌తో ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టి సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు మ్యాచ్‌ను గెలిపించాక విరాట్ మెడలోని చైన్‌కు ఉన్న వెడ్డింగ్ రింగ్‌కు ముద్దుపెట్టారు. దీనికి రిప్లైగా అనుష్క పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

Similar News

News February 24, 2025

KCRకు సవాల్ విసిరిన సీఎం రేవంత్

image

TG: కేసీఆర్ గతంలో 12 గంటల్లో సర్వే చేసి ఇప్పుడు తమ కులగణన లెక్కలు తప్పంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. ఏ గ్రామంలో, ఏ వార్డులో తప్పు ఉందో చూపించాలని సవాల్ విసిరారు. ‘కేసీఆర్ సర్వేలో 51 శాతం బీసీలుంటే మా సర్వేలో 56 శాతం ఉన్నారు. ముస్లింలను బీసీల్లో చేర్చారని బండి సంజయ్ అంటున్నారు. దూదేకుల సహా 28 జాతులకు ఎప్పటినుంచో బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి’ అని పేర్కొన్నారు.

News February 24, 2025

గేదెలు కొనేందుకు రెండో పెళ్లి.. ట్విస్ట్ ఏంటంటే?

image

UPలో గేదెలు కొనేందుకు ఓ మహిళ రెండో పెళ్లికి సిద్ధమైంది. ఆస్మాకు తన భర్తతో విభేదాలు తలెత్తగా కొంత కాలంగా పుట్టింట్లో ఉంటోంది. యోగి ప్రభుత్వం పెళ్లి చేసుకున్న జంటలకు సాయం చేస్తుందని తెలిసి తన బంధువును రెండో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసింది. తీరా సమయానికి మొదటి భర్త బంధువులు రంగంలోకి దిగడంతో పెళ్లి ఆగిపోయింది. అనధికారకంగా ప్రభుత్వ లబ్ధి పొందేందుకు సిద్ధమైన వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News February 24, 2025

BREAKING: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

image

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది. ఏపీలో 5, తెలంగాణలో 5 ఖాళీలున్నాయి. మార్చి 3న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ ఉండనుంది. ఏపీలో జంగా కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, తిరుమలనాయుడు, రామారావు, తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి, సుభాష్ రెడ్డి, మల్లేశం, రియాజుల్ హుస్సేన్ పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది.

error: Content is protected !!