News February 24, 2025
కోహ్లీ సెంచరీ.. అనుష్క శర్మ ❤️ పోస్ట్ వైరల్

పాకిస్థాన్‌పై విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ చేసి జట్టును గెలిపించడమే కాకుండా తిరిగి ఫామ్‌లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌ను టీవీలో చూసిన అనుష్క శర్మ భర్త కోహ్లీని ఫొటో తీసి హైఫై, లవ్ సింబల్‌తో ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టి సంతోషం వ్యక్తం చేశారు. అంతకుముందు మ్యాచ్‌ను గెలిపించాక విరాట్ మెడలోని చైన్‌కు ఉన్న వెడ్డింగ్ రింగ్‌కు ముద్దుపెట్టారు. దీనికి రిప్లైగా అనుష్క పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
Similar News
News February 24, 2025
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ మూవీలో ఊర్వశీ రౌతేలా?

ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీపై ఓ టాక్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఊర్వశీ రౌతేలా ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ ఆమెను సంప్రదించగా ఓకే చెప్పినట్లు టాక్. నెక్స్ట్ షెడ్యూల్‌లో ఆమె షూటింగ్‌లో జాయిన్ అవుతారని సమాచారం. ఈ మూవీలో టొవినో థామస్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానుంది.
News February 24, 2025
11 నిమిషాలు కూడా సభలో ఉండలేకపోయారా?: షర్మిల

AP: సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారని ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆరోపించారు. 11 మంది ఎమ్మెల్యేలతో కలిసి సభలో 11 నిమిషాలు కూడా కూర్చోలేకపోయారా అని ఆమె విమర్శించారు. ‘జగన్‌కు ప్రజల శ్రేయస్సు కంటే పదవులే ముఖ్యం. ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా? చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ సమావేశాలకు వెళ్లాలి. జనాలు ఛీ కొడుతున్నా జగన్ తీరు మాత్రం మారటం లేదు’ అని ఆమె ట్వీట్ చేశారు.
News February 24, 2025
ఉప ఎన్నికలు ఎలా వస్తాయి?: సీఎం రేవంత్

TG: రాష్ట్రంలో గత పదేళ్లలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెందుకు వస్తాయని సీఎం రేవంత్ ప్రశ్నించారు. ‘గతంలో TDP, కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను BRSలో చేర్చుకోలేదా? వారిని మంత్రులను చేయలేదా? అప్పుడు రాని ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయి. అప్పటి కోర్టులే కదా ఇప్పుడు ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయని ప్రతిపక్షాలు తరచుగా పేర్కొంటున్న సంగతి తెలిసిందే.