News November 12, 2024

కోహ్లీకిదే ఆఖరి సిరీస్: కోడై కూస్తున్న ఆసీస్ మీడియా

image

విరాట్ కోహ్లీ ఫేర్‌వెల్‌కు సిద్ధమయ్యారని ఆస్ట్రేలియన్ మీడియా కోడై కూస్తోంది. అతడికి BGT సిరీసే ఆఖరిదని హెరాల్డ్ సన్ ఆర్టికల్ ప్రచురించింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అతడి పాత్రను భర్తీచేస్తారని, ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నారని తెలిపింది. ‘ఈ సమ్మర్లో ఆసీస్ తీరంలో కోహ్లీ ఫేర్‌వెల్‌కు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. 2012 తర్వాత అతడు ఆస్ట్రేలియా-భారత్ రైవల్రీని మరో స్థాయికి తీసుకెళ్లారు’ అని పేర్కొంది.

Similar News

News March 3, 2026

భారత్ చేరుకున్న పీవీ సింధు

image

యుద్ధం వల్ల దుబాయ్‌లో చిక్కుకున్న పీవీ సింధు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఆమె బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యారు. సింధుతో పాటు మరికొంత మంది ప్రయాణికులు స్వస్థలాలకు చేరుకోవడంతో వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. తిరిగి స్వదేశానికి చేరుకోవడం ఆనందంగా ఉందని సింధు ట్వీట్ చేశారు. ఇందుకు సహకరించిన UAE అధికారులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి థాంక్స్ చెప్పారు.

News March 3, 2026

కేంద్ర మాజీ మంత్రి ఉన్నికృష్ణన్ కన్నుమూత

image

కేంద్ర మాజీ మంత్రి KP ఉన్నికృష్ణన్ (89) మంగళవారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన కేరళలో తుదిశ్వాస విడిచారు. 1971 నుంచి 1996 వరకు వడకర MPగా ప్రాతినిధ్యం వహించిన ఆయన VP సింగ్ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా పనిచేశారు. 1990 గల్ఫ్ యుద్ధ సమయంలో ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్‌ను రహస్యంగా కలిశారు. ప్రాణాలకు తెగించి మరీ 1.5 లక్షల మంది భారతీయులను స్వదేశానికి చేర్చడంలో కీలక పాత్ర పోషించారు.

News March 3, 2026

ఖమేనీ హత్యపై మౌనం బాధ్యతారాహిత్యం: సోనియా గాంధీ

image

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హత్యపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహించడాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తప్పుబట్టారు. ఇది ‘న్యూట్రల్‌’గా ఉండడం కాదని, విదేశాంగ విధానంలో ‘బాధ్యతారాహిత్యం’ అని విమర్శించారు. చర్చలు జరుగుతున్న సమయంలో ఒక దేశాధినేతను చంపడం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని, దీనిపై భారత్ స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లో దీనిపై చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు.