News May 10, 2024
సిక్సుల్లో కోహ్లీ రికార్డు

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో చెలరేగిన అతడు T20 క్రికెట్‌లో 400 సిక్సుల మార్కును అందుకున్నారు. ఆ మ్యాచ్‌లో 6 సిక్సులు బాదిన కోహ్లీ మొత్తంగా పొట్టి ఫార్మాట్‌లో 401 సిక్సులు కొట్టారు. అత్యధిక సిక్సులు కొట్టిన భారత క్రికెటర్‌గా రోహిత్ శర్మ(506) మొదటి స్థానంలో ఉండగా కోహ్లీ రెండో స్థానంలో కొనసాగుతున్నారు. ఈ ఐపీఎల్లో 12 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 30 సిక్సులు కొట్టారు.
Similar News
News March 19, 2026
ఇరాన్ ఆ కేబుల్స్ కట్ చేస్తే ఇంటర్నెట్ బంద్!

పశ్చిమాసియా ఉద్రిక్తతలు ఇంటర్నెట్ కనెక్షన్లనూ దెబ్బతీసే ప్రమాదం ఉంది. హార్ముజ్, బాబ్-ఎల్-మాండెబ్ జలసంధుల కింద పెద్ద ఎత్తున డేటా కేబుల్స్ ఉన్నాయి. ఇవి యూరప్, ఆసియా, ఆఫ్రికా మధ్య ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను లింక్ చేస్తున్నాయి. యుద్ధంలో భాగంగా ఇవి ధ్వంసమైతే మనకు ఇబ్బందులు తప్పవు. 2024లో హౌతీల దాడుల సమయంలో ఇదే జరిగింది. పైగా మిలిటరీ యాక్టివిటీ వల్ల వాటిని రిపేర్ చేయడానికి నెలల సమయం పట్టింది.
News March 19, 2026
ఈరోజు నమాజ్ వేళలు (17-3-2026) మంగళవారం

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6:23 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.25 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.47 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.27 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.39 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News March 19, 2026
హార్ముజ్ మాత్రమే కాదు మరో రూట్ పైనా ఇరాన్ అటాక్!

ఇరాన్‌లోని అతిపెద్ద LNG ప్లాంట్ అయిన ‘సౌత్ పార్స్’పై నిన్న ఇజ్రాయెల్ దాడి చేయడంతో యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ ఫెసిలిటీస్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తోంది. హార్ముజ్ జలసంధి మూసివేతతో సౌదీ ఎర్రసముద్ర తీరంలోని యన్బు పోర్ట్ ద్వారా చమురు ఎగుమతి చేస్తోంది. తాజాగా ఇరాన్ అక్కడి SAMREF ఆయిల్ రిఫైనరీపైనా అటాక్ చేసింది. దీంతో ఉద్రిక్తత మరింత పెరిగింది.


