News May 24, 2024
హైదరాబాద్‌లో కోహ్లీ రెస్టారెంట్

క్రికెటర్ విరాట్ కోహ్లీకి పలు వ్యాపారాల్లో పెట్టుబడులున్నాయి. వాటిలో ముఖ్యమైనది ‘వన్ 8 కమ్యూన్’ రెస్టారెంట్ నెట్వర్క్. ఇప్పటికే బెంగళూరు, ముంబై, పుణె, కోల్‌కతా, ఢిల్లీలో ఈ రెస్టారెంట్లు ఏర్పాటు చేయగా, కొత్త బ్రాంచ్ ఇప్పుడు హైదరాబాద్‌లోనూ తెరిచారు. హైటెక్ సిటీలోని నాలెడ్జ్ సిటీ సమీపంలో ఈరోజే ఇది ప్రారంభమైందని విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించారు.
Similar News
News January 19, 2026
CMERIలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

CSIR-సెంట్రల్ మెకానికల్ ఇంజినీర్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (<
News January 19, 2026
YCP ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు

AP: లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు రావాలని అందులో పేర్కొంది. కాగా ఇప్పటికే ఆ పార్టీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఈ నెల 22న విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.
News January 19, 2026
బంధంలో బ్యాలెన్స్ ముఖ్యం

అన్యోన్యంగా జీవితాన్ని సాగించాలనుకునే దంపతులు పట్టు విడుపులు సమానంగా పాటించాలి. అంతేగానీ బంధాన్ని నిలబెట్టుకోవాలన్న తాపత్రయంతోనో, నలుగురూ వేలెత్తి చూపుతారన్న భయంతోనో నిరంతరం అవతలి వారి తప్పులను క్షమిస్తూ పోతే మీ జీవితాన్ని మీరే పాడుచేసుకున్న వారవుతారు. కాబట్టి బంధమేదైనా అన్ని రకాలుగా బ్యాలన్స్డ్గా ఉంటేనే కలకాలం నిలుస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.


