News November 24, 2024

పెర్త్‌లో కోహ్లీ కుమారుడు అకాయ్

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కుమారుడు అకాయ్ ఫొటోలు తొలిసారిగా బయటకు వచ్చాయి. ఇండియా, ఆస్ట్రేలియా తొలి టెస్టు మ్యాచ్‌కు అనుష్క తనతో పాటు అకాయ్‌ను పెర్త్ స్టేడియానికి తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అకాయ్ అచ్చం కోహ్లీలాగే ఉన్నాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ టెస్టులో విరాట్ (100*) సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.

Similar News

News November 23, 2025

ఈ నెల 28న అమరావతికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్

image

ఈ నెల 28న రాజధాని అమరావతిలో పలు బ్యాంక్‌ భవనాలకు శంకుస్థాపన జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివిధ బ్యాంకులకు CRDA భూకేటాయింపులు చేసింది. శంకుస్థాపన అనంతరం CRDA ప్రధాన కార్యాలయం దగ్గర సభకు నిర్మలా సీతారామన్‌, పెమ్మసాని, చంద్రబాబు, పవన్‌ హాజరు కానున్నారు.

News November 23, 2025

బోస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

image

<>జేసీ<<>> బోస్ ఇన్‌స్టిట్యూట్‌ 13 డఫ్ట్రీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎనిమిదో తరగతి అర్హతతో పాటు పని అనుభవం గల వారు డిసెంబర్ 15వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://jcbose.ac.in/

News November 23, 2025

శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

image

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>