News May 6, 2024
టేబుల్ టాపర్‌గా కోల్‌కతా
లక్నోతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా భారీ విజయం సాధించడంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మొత్తం 16 పాయింట్లు సాధించి మెరుగైన రన్‌రేట్‌తో టేబుల్ టాపర్‌గా నిలిచింది. రాజస్థాన్ రాయల్స్ (16 పాయింట్లు) రెండో స్థానానికి పడిపోయింది. ఆ తర్వాతి స్థానాల్లో చెన్నై (12), హైదరాబాద్ (12), లక్నో (12), ఢిల్లీ (10), బెంగళూరు (8), పంజాబ్ (8), గుజరాత్ (8), ముంబై (6) ఉన్నాయి.
Similar News
News January 3, 2025
ఈసారి చలి వల్ల ఢిల్లీలో పాఠశాలలకు సెలవులు
ఢిల్లీలో మొన్నటిదాకా కాలుష్యం వల్ల మూతబడిన స్కూళ్లు, ఇప్పుడు కోల్డ్ వేవ్స్ వల్ల మూతబడ్డాయి. శీతాకాలం వల్ల పడిపోతున్న పగటి ఉష్ణోగ్రతలు, చలి తీవ్రత కారణంగా NCR పరిధిలోని గౌతమ్‌బుద్ధ నగర్‌లో 8వ తరగతి వరకు సెలవు ప్రకటించారు. తదుపరి ఉత్తర్వుల వరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయి. మధ్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో ఈ Janలో గతం కంటే అధికంగా చలి తీవ్రత ఉంటుందని IMD తెలిపింది.
News January 3, 2025
సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్ కీలకం?
సిడ్నీ మైదానంలో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్‌కు అద్భుత రికార్డ్ ఉంది. ఇక్కడ ఆయన మూడు ఇన్నింగ్స్‌లు ఆడగా 159*, 36, 97 పరుగులు చేశారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన అండగా నిలిచారు. మరోసారి భారత జట్టుకు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సిరీస్‌ను 2-2తో సమం చేయాలంటే పంత్ రాణించాలని ఆశిస్తున్నారు. కాగా ఈ వేదికపై భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.
News January 3, 2025
సైబర్ ట్రక్ వల్లే పేలుడు తీవ్రత తగ్గింది: పోలీసులు
లాస్ వెగాస్‌లోని ట్రంప్ హోటల్ వద్ద జరిగిన పేలుడు తీవ్రత సైబర్‌ట్రక్ కారు వల్ల తగ్గిందని పోలీసులు తెలిపారు. కారు స్ట్రక్చరల్ డిజైన్ వల్ల పేలుడు తీవ్రత పైకి ఎగసిపడడంతో దాని ప్రభావం తగ్గిందన్నారు. హోటల్ ముందు ఉన్న అద్దాలు పగలకపోవడమే దానికి నిదర్శనమన్నారు. నిందితుడిని పట్టుకోవడంలో సర్వేలైన్స్ ఫుటేజీని అందించి ఎలాన్ మస్క్ సాయం చేశారని పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు.