News April 3, 2024
కోల్‌కతా గ్రాండ్ విక్టరీ

విశాఖ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 106 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. KKR విధించిన 273 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఢిల్లీ బ్యాటర్లు తేలిపోయారు. పంత్(55), స్టబ్స్(54) మినహా మిగతా బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు. దీంతో ఢిల్లీ 17.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. వైభవ్, వరుణ్ చక్రవర్తి 3, స్టార్క్ రెండు, రసెల్, నరైన్ తలో వికెట్ తీశారు.
Similar News
News November 20, 2025
పోలి పాడ్యమి రోజు ఇలా చేస్తే..

నేటితో కార్తీక మాసం ముగియనుంది. కార్తీక అమావాస్య తర్వాత రోజున పోలి పాడ్యమిని జరుపుతారు. ఈసారి అది శుక్రవారం వస్తోంది. కార్తీక వ్రతం ఆచరించినవారు ఆ పుణ్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఆవు నెయ్యితో వెలిగించిన 31 వత్తుల దీపాలను అరటి దొప్పలలో పెట్టి నదీ జలాల్లో నిమజ్జనం చేస్తారు. ఇలా చేస్తే కుటుంబంలో దారిద్ర్యం తొలగిపోతుందని నమ్మకం. ☞ పోలి పాడ్యమి కథ, పూజా టైమింగ్స్ వంటి ఇతర వివరాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.
News November 20, 2025
పోలి పాడ్యమి ఎప్పుడు జరుపుకోవాలంటే..?

పోలి పాడ్యమిని నవంబర్ 21వ తేదీన(శుక్రవారం) జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ‘పాడ్యమి తిథి నవంబర్ 20 ఉదయం 10:30కి ప్రారంభమై, నవంబర్ 21 మధ్యాహ్నం 12:45 వరకు ఉంటుంది. సూర్యోదయాన్ని పరిగణనలోకి తీసుకొని నవంబర్ 21నే పోలి పాడ్యమి నిర్వహించాలి. ఇక నవంబర్ 22, 2025 శనివారం తెల్లవారుజామున 4:35 నుంచి 6:00 గంటల వరకు దీపాలను నీటిలో వదలడానికి అనుకూల సమయం’ అని చెబుతున్నారు.
News November 20, 2025
ఫోన్‌పే టాప్!

మన దేశంలో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్‌పే ఆధిపత్యం కొనసాగుతోంది. 45.47% మార్కెట్ షేర్‌తో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత గూగుల్ పే (34.62%), పేటీఎం (7.36%), Navi (2.78%), సూపర్ మనీ (1.28%) ఉన్నాయి. ఫోన్‌పే, గూగుల్ పే కలిపి 80 శాతానికి పైగా మార్కెట్ షేర్‌ను కలిగి ఉండటం విశేషం. BHIM, CRED లాంటి ప్లాట్‌ఫామ్స్ కూడా వినియోగిస్తున్నారు. మరి మీరు ఏది వాడుతున్నారో కామెంట్ చేయండి.


