News August 17, 2024

కోల్‌కతా ఘటన.. సీబీఐ విచారణకు మాజీ ప్రిన్సిపల్

image

కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి హత్యాచారంపై సీబీఐ దర్యాప్తు ముమ్మరమైంది. ఘటన జరిగిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ సీబీఐ విచారణకు హాజరయ్యారు. ఆయనను అధికారులు విచారిస్తున్నారు. మరోవైపు ఘటనను నిరసిస్తూ దేశవ్యాప్తంగా వైద్యసిబ్బంది ఆందోళనలు కొనసాగుతున్నాయి.

Similar News

News January 11, 2026

ఆవు పాలకు ఉన్న ప్రత్యేకతలు ఇవే..

image

ఆవు పాలలో కొవ్వు శాతం గేదె పాల కంటే తక్కువగా ఉంటాయి. అందుకే ఇవి సులువుగా జీర్ణమవుతాయి. వీటిలో ఉండే ప్రోటీన్స్ కండరాలను బలోపేతం చేస్తాయి. ఆవు పాలలో అధిక కాల్షియం, విటమిన్ డి ఎముకలు, దంతాలను బలపరుస్తాయి. శరీరానికి మంచి శక్తిని అందిస్తాయి. గుండె జబ్బులు ఉన్నా, బాగా లావుగా ఉన్నా, జీర్ణ సమస్యలు ఉంటే ఆవు పాలను తాగడం మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులకు ఆవు పాలు మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

News January 11, 2026

బీపీ నార్మల్ అవ్వాలంటే ఇలా చెయ్యాలి

image

మారిన జీవనశైలితో ప్రస్తుతకాలంలో చిన్నవయసులోనే చాలామంది బీపీతో ఇబ్బంది పడుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ముందు నుంచే కొన్నిజాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఉప్పు ఎక్కువగా వాడకుండా మసాలాలు, హెర్బ్స్ వాడాలి. ఎత్తుకు తగిన బరువుండేలా చూసుకోవాలి. ఫిజికల్‌గా యాక్టివ్‌గా ఉండేలా చూసుకోవాలి. స్మోకింగ్ మానేయాలి. ప్రాసెస్డ్, ఫ్రైడ్ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి. అల్లాన్ని ఎక్కువగా వంటల్లో తీసుకోవాలి.

News January 11, 2026

భోగి మంటలు వేస్తున్నారా?

image

AP: సంక్రాంతి పండుగ పురస్కరించుకొని భోగి వేళ వేసే మంటల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్ కృష్ణయ్య కీలక సూచనలు చేశారు. భోగి మంటల్లో టైర్లు, ఫ్లెక్సీలు, ప్లాస్టిక్ వస్తువులు, రంగులేసిన ఫర్నీచర్, నిరుపయోగమైన ఎలక్ట్రానిక్ వస్తువులు వేయరాదని కోరారు. వీటిని కాల్చినప్పుడు వచ్చే కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్ తదితర విష వాయువులతో ఆరోగ్యానికి ప్రమాదమని సూచించారు.